YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఫలితాలు ఇస్తున్న డిజిటల్ ఇండియా

ఫలితాలు ఇస్తున్న డిజిటల్ ఇండియా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జులై 1 నుంచీ ఆన్‌లైన్ మనీ ట్రాన్సా‌క్షన్లపై ఛార్జీలు ఎత్తివేసింది రిజర్వ్‌బ్యాంక్. నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రుసుము వసూలు చేయవద్దని ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు లావాదేవీలు తగ్గించడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఛార్జీలను రద్దు చేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇండియాని డిజిటల్ రంగంలో దూసుకెళ్లేలా చేసేందుకు తీసుకునే నిర్ణయాల్లో ఇదీ ఒకటని చెప్పుకోవచ్చు. 2015 జులై 1న ప్రధాని నరేంద్ర మోదీ... డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతీ కార్యక్రమంలో టెక్నాలజీ వాడకాన్ని పెంచడం, టెక్నాలజీ వస్తువుల ధరలను తగ్గించడం, ఆర్థిక లావాదేవీలు డిజిటల్ రూపంలో జరిగేలా చెయ్యడం ఇవన్నీ డిజిటల్ ఇండియాలో భాగం అయ్యాయి.ఇండియాలో డిజిటల్ ఇండియా ఫలాలు ఇప్పుడిప్పుడే అందరికీ అందుతున్నాయి. ప్రస్తుతం 2లక్షల 50వేల గ్రామ పంచాయితీలు హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్‌తో కనెక్ట్ అయ్యాయి. మొత్తం 3.40 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ వేశారు. 1.29 గ్రామ పంచాయతీల్లో భారత్ నెట్ అందుబాటులో ఉంది. ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్లు ఉన్న రెండో అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది.ప్రస్తుతం ఇండియాలో ప్రతీ పౌరుడూ డిజిటల్ సర్వీసులు అందుకుంటున్నారు. సిమ్ కార్డ్ కావాలంటే ఆన్‌లైన్‌లో ఫామ్ ఫిలప్ చెయ్యవచ్చు. కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే బ్యాంకుకి వెళ్లాల్సిన పనిలేదు. ఆధార్‌తో కూడిన విధానంలో మొబైల్ సిమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ తెరుస్తున్నారు. ప్రావిడెంట్ ఫండ్ కూడా... ఆధార్‌తో కూడిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా ఈజీగా పొందేందుకు వీలవుతోంది. దేశంలోని 322 మేజర్ హాస్పిటల్స్‌ ఈ-హాస్పిటల్ సర్వీసులను అందిస్తున్నాయి. అలాగే 18 రాష్ట్రాల్లోని 362 కేంద్ర సేవలు... 13 భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్ స్కాలర్‌షిప్స్, ఈ-సేవ, సాయిల్ హెల్త్ కార్డులు... ఇలా అన్నీ డిజిటల్ సేవలతో లింక్ అవుతున్నాయి.గత ఐదేళ్లలో రూ.7.44 లక్షల కోట్లు... 439 పథకాల కింద లబ్దిదారులకు అందాయి. రూ.1.41 లక్షల కోట్ల అదనపు టాక్స్ ఆదాయం పక్కదారి పట్టకుండా కేంద్రానికి చేరింది. ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ లిటరసీ ప్రోగ్రాం - ద్వారా 2.21 కోట్ల మంది గ్రామస్థులకు అక్షరాశ్యతలో ట్రైనింగ్ ఇస్తున్నారు. 2016లో రూ.79.67 కోట్ల డిజిటల్ పేమెంట్స్ జరగగా... 2019 మార్చి నాటికి అవి రూ.332.34 కోట్లకు చేరాయి. ప్రస్తుతం దేశంలో 268 రకాల మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ యూనిట్లు గత ఐదేళ్లలో ప్రారంభమయ్యాయి.ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్నీ డిజిటలైజేషన్ చెయ్యాలి. ప్రభుత్వంతో ముడిపడిన అన్ని పనులకూ పేపర్ వర్క్‌ని పూర్తిగా రద్దు చెయ్యాలన్న టార్గెట్ ఉంది. ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. అలాగే ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయం, వ్యక్తిగత సమాచార భద్రత కల్పించబోతోంది. వాట్సాప్ స్థానంలో దేశీయంగా ఓ యాప్ తయారుచేయించబోతోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మరిన్ని చర్యలు తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల భవిష్యత్తులో డిజిటల్ రంగానికి దేశీయంగా అత్యంత ప్రాధాన్యం పెరగనుందని అనుకోవచ్చు.

Related Posts