యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. ఒక్క ముంబాయిలోనే పదహారు మంది మరణించారు. మంగళవారం ఉదయం తూర్పు మలద్ లో కంపౌండ్ గోడ కూలిపోయింది. 13 మృతి చెందారు. ఒక బాలిక శిధిలాల్లో చిక్కుకుపోయింది. థానే జిల్లా కళ్యాణ్ లో స్కూల్ గోడ కూలిన ఘటనలో మూడేళ్ల బాలుడితో సహ ముగ్గురు మరణించారు. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ వర్షం కురవలేదు. మంగళవారం కుడా భారీ వర్షం కురవనున్నదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పరిస్థితిని నేరుగా సమీక్షిస్తున్నారు. ప్రజలు సాధ్యమైనంతవరకు ఇంటిలోనే వుండిపోవాలని సూచించారు. పలు ప్రాంతల్లో నావికా దళాలు రంగంలోకి దిగాయి. పలు లోకల్ రైళ్లను రద్దు చేసారు. 52 విమానాలను రద్దుచేయగా, 54 విమానాల దారి మళ్లించారు. గత రాత్రి స్పైస్ జెట్ రన్ వే నుంచి జారిపోవడంతో ప్రధాన రన్ వేను అధికారులు మూసివేసారు.