యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
భారత్, బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లో వరల్డ్ కప్ పోరు సాగనుంది. ఇందులో ఇండియా గెలిస్తే, సరాసరి సెమీస్ కు చేరుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు 2015లో ఓటమికి బదులిస్తామని బంగ్లాదేశ్ నమ్మకంతో ఉంది. ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ తో పాటు స్పిన్ బౌలింగ్ పై ఆశలు పెట్టుకుని, భారత స్టార్ ఆటగాళ్లను నిలువరిస్తామని అంటోంది. కాగా, ఇండియాతో పాటు పాక్ పైనా బంగ్లాదేశ్ గెలిచి, న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉంటాయి.