యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టీమిండియా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్ దీప్ యాదవ్ ను పక్కనబెట్టి ఫిట్ నెస్ నిరూపించుకున్న భువనేశ్వర్ యాదవ్ కు తుదిజట్టులో చోటు కల్పించారు. మరోవైపు ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా భారీ షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బందిపడిన కేదార్ జాదవ్ స్థానంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. ఇక, బంగ్లాదేశ్ విషయానికొస్తే, కీలక ఆటగాడు మహ్మదుల్లా ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోవడంతో షబ్బీర్ రెహ్మాన్ కు అవకాశం లభించింది.