YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గృహనిర్మాణంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష సోషల్ ఆడిట్ లో గృహనిర్మాణ పనులు

గృహనిర్మాణంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష సోషల్ ఆడిట్ లో గృహనిర్మాణ పనులు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సచివాలయంలో గృహనిర్మాణంపై మంగళవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమీక్షా సమావేశం నిర్వావచీరు.  అ భేటకి  మంత్రులు బొత్స, శ్రీరంగనాథ రాజు, అధికారులు హజరయ్యారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇళ్లు లేని వాడు రాష్ట్రంలో ఉండకూడదు. ఎక్కడైనా లబ్ధిదారుడు ఒక్కపైసా ఖర్చు చేయాల్సిన పనిలేదు. ఈ సంవత్సరం శాచ్యురేషన్ విధానంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామని అన్నారు. ప్రతి లబ్ధిదారునికీ 1.5 సెంట్లు చొప్పున పంపిణీ చేస్తాం.
ఉగాది నాటికల్లా ఇళ్లస్థలాలు, పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇళ్లస్థలాల పంపిణీని అన్ని జిల్లాలో ఘనంగా చేపట్టాలి.
వచ్చే సంవత్సరం నుంచి ఇళ్ల నిర్మాణం,  వైయస్సార్ ఇళ్ల కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం వుంటుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా పారదర్శకంగా ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. లబ్దిదారుల జాబితాను గ్రామ సచివాలయంలోనే ప్రదర్శిస్తాం.
పెన్షనర్ల జాబితాకూడా గ్రామ సచివాలయాల్లో బోర్డుపై ఉంచుతాం. ఆ జాబితా 365రోజులు అందరికీ అందుబాటులో ఉంచేలా చూడాలని ఆదేశించారు. దీనివల్ల సోషల్ ఆడిట్ నిరంతరం కొనసాగుతున్నట్టు ఉంటుంది. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం, అవినీతికి తావులేదు. ఎవరైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పక్షపాతం, అవినీతి వల్లే సమస్యలు వస్తున్నాయి. మా పార్టీకి ఓటు వేయకపోయినా అర్హత ఉంటే ఇల్లు ఇవ్వాల్సిందే. మేం చేసే మంచిని చూసి మాకు ఓటేయాలి అన్నదే మా సిద్ధాంతమని అన్నారు. వ్యవస్థ మారాలి, ఆ తపనతోనే పనిచేయండి. నిజాయితీగా వెళ్తే... కచ్చితంగా మార్పు వస్తుందని అయన అన్నారు.
ఇళ్ల నిర్మాణం కోసం గ్రామాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిని వినియోగించండి. లేనిచోట ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి పేదలకు ఇస్తుంది. కొనుగోలుచేసిన భూమిని ప్లాట్ల రూపంలో విభజించి వాటిని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలి. కేవలం పట్టా ఇచ్చి, తన ఇంటి స్థలం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి లబ్ధిదారుడికి ఉండకూడదు. రాళ్లు పాతి, మార్కింగ్ వేసి పక్కాగా ఇంటి స్థలాన్ని అక్కచెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి. ఆధార్కార్డుతో లింక్ చేసి ఇళ్లస్థలాలను పంపిణీచేయండి. అలాగే పట్టణాలు, నగరాల్లో కూడా ఎంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందో చూడండి, లేకపోతే కొనుగోలు చేయండని అన్నారు. ఈ స్థలంలో ఫ్లాట్లు కట్టి లబ్ధిదారులకు ఇవ్వాలి. ఏ ఫ్లాట్ ఎక్కడ కడుతున్నారో ముందుగానే గుర్తించి పలానా ప్లాటు, పలానా వారికి వస్తుందని కేటాయించండని అన్నారు.
ఈ ఫ్లాట్లుకడుతున్న భూమిలో అన్ డివైడెడ్ షేర్, దీంతోపాటు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి లబ్ధిదారులకు ఇవ్వండి:
రీజనబుల్సైజులో ఫ్లాట్లు కట్టి ఇవ్వాలి. గతంలో చదరపు అడుగు రూ.1100 అయ్యే దాన్ని రూ. 2200–2300కు పెంచి దోచేశారని విమర్శించారు. షేర్వాల్ అని పేరుపెట్టి రూ.1100లతో అయ్యేదాన్ని రూ.2300 చేస్తే ఎలా? షేర్వాల్ అని పేరుపెట్టి పేదలమీద భారం వేస్తారా?  పేదలపై ప్రతి నెలా రూ.3వేల భారం వేయడం భావ్యమా? ఉచితంగా ఇళ్లు ఇవ్వాల్సిందిపోయి... పేదవాడిమీద రూ.3 లక్షల భారం వేయడం న్యాయమా అని అడిగారు. అర్బన్ హౌసింగ్లో కడుతున్న ఫ్లాట్లపై రివర్స్ రివర్స్టెండరింగ్కు వెళ్లాలి.
అదే టెక్నాలజీ , అదే స్పెసిఫికేషన్స్తో రివర్స్టెండరింగ్ నిర్వహించాలి. కాంట్రాక్టర్లను వేధించడం ఉద్దేశం కాదు, మాకు ఎవరిపైనా కక్షలేదని అయన అన్నారు. బీదవాడికి నష్టం రాకూడదు, 20 ఏళ్లపాటు నెలా నెలా కట్టే పరిస్థితి ఆ పేదవాడికి ఉండకూడదన్నదే ఉద్దేశం. లంచాలు వల్ల బీదవాడు నష్టపోకూడదన్నదే మా అభిప్రాయం. బాగా ప్రచారం ఇచ్చి.. ఎక్కవ మంది రివర్స్టెండరింగ్లో పాల్గొనేలా చూడాలి. ఎక్కువమంది రివర్స్ టెండరింగ్లో పాల్గొనేందుకు ఎలిజిబిలిటీ క్రైటీరియాను తగ్గిద్దామని అన్నారు.
పునాది స్థాయి దాటని, శాంక్షన్ అయినా పనులు ప్రారంభం కాని ఫ్లాట్ల్ల విషయంలో ఏ టెక్నాలజీని అయినా అనుమతించాలని నిర్ణయించాం. ఎంత ఆదాచేయగలమో చేయండని అధికారులకు సూచించారు.

Related Posts