యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
టీమ్ఇండియా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు రోజుల కిందట ఇంగ్లాండ్ చేతిలో కంగుతిన్న కోహ్లీసేన.. అదే మైదానంలో మంగళవారం బంగ్లాదేశ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. పాయింట్లను 13కు పెంచుకుని పట్టికలో రెండో స్థానానికి చేరిన భారత్.. సెమీస్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (104; 92 బంతుల్లో 7×4, 5×6), కేఎల్ రాహుల్ (77; 92 బంతుల్లో 6×4, 1×6) జట్టుకు అద్భుత ఆరంభాన్నివ్వగా.. చివర్లో రిషబ్ పంత్ (48; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించాడు. 350 దాటేలా కనిపించిన భారత్‌కు ముస్తాఫిజుర్ (5/59), షకిబ్ (1/41) కళ్లెం వేశారు. అనంతరం బంగ్లా ఛేదనలో గట్టిగానే పోరాడినా.. చివరికి 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకిబ్ అల్హసన్ (66; 74 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్. హార్దిక్ పాండ్య (3/60), బుమ్రా (4/55) బంగ్లాను దెబ్బ తీశారు. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ శనివారం తన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొంటుంది.