యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ఇపుడు ఫుల్ ఫోకస్ పెట్టేసింది. కేంద్రంలో బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం ఒక కారణమైతే, తెలంగాణాలో బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఎంపీలు గెలుచుకోవడంతో కమలానికి ఇక్కడ ఆశ పుట్టింది. ఇక రాజకీయాల్లో గండర గండడు చంద్రబాబు దారుణంగా ఏపీలో ఓటమి పాలు కావడం, పెద్దగా అనుభవం లేని జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రలో కూడా దూసుకుపోతామన్న నమ్మకం వచ్చింది. మొత్తం మీద చూసుకుంటే బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలో రాజకీయం పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. టార్గెట్ 2024 అంతూ ఆపరేషన్ మొదలెట్టేసింది.ఏపీ తెలంగాణాలో మొదటి ప్రాధాన్యత కేసీయార్ ఇలాకానేనట. అక్కడ రెండోమారు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. 2023లో మూడవసారి ఆయన రావడం అంటే అదో అద్భుతమే అవుతుంది. అప్పటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ బాగా పెరిగిపోతుంది. సరైన ప్రతిపక్షంగా ఉంటే గెలవడం పెద్ద కష్టం కాదు, పైగా కేసీయార్ ఆనాటికి మరింత వయోభారంతో కుంగిపోతారు. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుల పరోక్ష రాజకీయ యుధ్ధం క్లైమాక్స్ కి చేరుకుంటుంది. దాంతో టీయారెస్ ని గద్దె దింపడం సులువు అవుతుందని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. దాంతో కేసీయార్ ని ఇప్పటి నుంచి ఇబ్బందుల పాలు చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తప్పుల కారణంగా ఎంతో మంది విద్యార్ధులు చనిపోయారు. దాన్ని కేసీయార్ ఎలాగో మరుగున పరచరారు. ఇపుడు దాని మీద కేంద్ర హోం మంత్రి హోదాలో నివేదిక అడగాలని అమిత్ షా నిర్ణయించారని టాక్. అదే జరిగితే అగ్గి రాజుకున్నట్లే.ఇక పొరుగున కేసీయార్ తో మంచి సంబంధాలు జగన్ కొనసాగిస్తున్నారు. అలాగే కేంద్రంలోకి మోడీతో బాగానే ఉంటున్నారు. బీజేపీకి మాత్రం ఈ దోస్తీ అంతగా ఇష్టం ఉన్నట్లుగా అనిపించడం లేదు. జగన్ కేసీయార్ రాసుకుపూసుకుతిరగడం సహించలేకపోతున్నారు. కేసీయార్ కి జగన్ బలన్ని ఇస్తున్నారని కేంద్ర పాలకులు నమ్ముతున్నారు. కేసీయార్ గ్రాఫ్ తగ్గుతోన్న వేళ ఆయన ఉమ్మడి ఏపీకి పెద్దన్నలా వ్యవహరించేలా జగన్ అండ ఇస్తున్నారని అంటున్నారు. జగన్ తప్పుకుంటే కేసీయార్ పూర్తి పని పట్టాలని బీజేపీ ఆలోచన. జగన్ కొత్తగా అధికారంలోకి వచ్చిన నాయకుడు. ఇపుడే ఆయన్ని ముట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదు. రాజకీయ వాతావరణం కూడా ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఉంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ కి మోడీ, కేసీయార్ కావాల్సిన వారే. ఎలా వ్యవహరిస్తారన్నది చూడాలి.