యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా మేనేజ్మెంట్ అంబటి రాయుడికి తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గాయం కారణంగా వరల్డ్ కప్ సిరీస్‌కు విజయ్ శంకర్ దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో తనకు అవకాశం కల్పిస్తారని అంబటి రాయుడు ఆశించాడు. కానీ.. మయాంక్ అగర్వాల్‌కు టీమిండియా మేనేజ్మెంట్ పచ్చ జెండా ఊపింది. శిఖర్ ధావన్ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.