YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సబ్జెక్ట్ పై ప్రిపేర్ అయి సభ కు రావాలి

సబ్జెక్ట్  పై ప్రిపేర్ అయి సభ కు రావాలి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

శాసనసభలో చర్చలు అర్థవంతంగా  జరిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శాసనసభలో  ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను ప్రజలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొంటారని అన్నారు. బుధవారం నాడు ఏపీ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు రెండు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులకు టీడీపీ సభ్యులు  దూరంగా ఉన్నారు. మంచి శాసనసభ్యులుగా పేరు తెచ్చుకొనేందుకు సభ ఉపయోగపడుతోందని  ఆయన చెప్పారు. తరువాత  సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి రూల్స్ గురించి తెలుసుకోవాలన్నారు. అంతేకాదు ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలని భావిస్తున్నారో ఆ సబ్జెక్టు మీద  అవగాహనను పెంచుకోవాలని  ఆయన సభ్యులకు సూచించారు.
ఆయా సబ్జెక్టు మీద ప్రిపేర్ అయితేనే ఇతర సభ్యులు అడ్డు తగిలినా.. ప్రశ్నించినా కూడ వాటికి సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ‘సభలో మన సంఖ్య ఎక్కువ కదా. మనం చేయి ఎత్తితే స్పీకర్  అవకాశం ఇస్తారని చాలామంది భావిస్తారు. కానీ అలా జరగకపోవచ్చు. ఫలానా అంశంపై వీరు-వీరు మాట్లాడుతారని స్పీకర్ గారికి లిస్ట్ ఇచ్చి ఉంటాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్  అందరికీ అవకాశం ఇస్తారు. ఆ జాబితాలో మన పేరు లేకపోతే మనకు అవకాశం రాకపోవచ్చు. దీనికి మరోలా అనుకోవాల్సిన పనిలేదని అన్నారు.  ‘అసెంబ్లీలో ఓ సబ్జెక్ట్ పై మాట్లాడేటప్పుడు పూర్తిగా ప్రిపేర్ అయి రావాలని సూచించారు.

Related Posts