యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సోమవారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఢిల్లీ పోలీసు కమీషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆయన మందలించారు. ఓ పార్కింగ్ స్థలం గురించి రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ అల్లర్లలో ఓ ప్రార్థనా మందిరం ధ్వంసమైంది. దీని గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసు చీఫ్‌కు కేంద్ర హోంశాఖ సమన్లు జారీ చేసింది. చాందినీ చౌక్‌లోని హౌజ్ ఖ్వాజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులు అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రార్థనా మందిరం కూల్చివేత ఘటనపై ఢిల్లీ హైకోర్టులో అడ్వకేట్ అలక్ పిల్ వేశారు. ఓ బిల్డింగ్ ముందు 20 ఏళ్ల కుర్రాడు స్కూటర్ పార్కింగ్ చేస్తున్న సమయంలో గొడవ జరిగింది.