యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్న ఓ శరణార్థి కేంద్రంపై వైమానిక బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో సుమారు 40 మంది మృతి చెందారు. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. శరణార్థి కేంద్రం ఛిన్నాభిన్నమైన ఫోటోలను రిలీజ్ చేశారు. దాడిలో గాయపడ్డ వారిని ఎమర్జెన్సీ వర్కర్లు రక్షిస్తున్నారు. తజౌరా డిటెన్షన్ సెంటర్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తన అఫిషియల్ ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. వైమానిక దాడి వల్ల శరణార్థి కేంద్రంలో ఉన్న మరో 80 మంది గాయపడ్డారు. జనరల్ ఖలీఫా హఫ్తార్ నేతృత్వంలోని ప్రభుత్వ వ్యతిరేక దళాలు ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. దాడిలో మృతిచెందిన వారిలో ఎక్కువ శాతం మంది ఆఫ్రికన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్ దిశగా అక్రమంగా తరలివెళ్తున్న లక్షలాది శరణార్థులు దీన పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2011లో గడాఫీ మరణం తర్వాత దేశంలో అస్థిరత నెలకొన్నది.