YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పక్కా రోడ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి

పక్కా రోడ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

నియోజక వర్గం లో రహదారు లు అద్వానం గా ఉన్నాయని, పక్కా రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చెయ్యాలని అధికారులను ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు.  ప్రజా
సమస్య ల పరిష్కారమే లక్ష్యం గా బుదవారం ఉదయం పశ్చిమ నియోజక వర్గం లో నగర పాలక సంస్థ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భగా స్థానికులు పలు
సమస్యలను మంత్రి  దృష్టికి తీసుకువచ్చారు. గత ఐదు సంవత్సరాలు గా రహదారులు గోతులతో అద్వానం గా ఉన్నాయని వాహన దారులే కాక పాద చారులు కూడా నడిచే పరిస్థితి లేదన్నారు.
ముఖ్యం గా రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ వద్ద నుంచి అర్ అప్పారావు విది, పార్క్ రోడ్, పోతిన ప్రకాష్ మార్కెట్ రోడ్ వెంటనే పక్కా రహదారుల నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. నియోజక వర్గంలో నీ సైడ్ కాలువలు మరియు మెయిన్ డ్రైన్ లలో మురుగు పుడికలను వెంటనే తొలగించాలన్నారు. వన్ టౌన్,నైజాం గేట్,ఊర్మిళ నగర్ తదితర ప్రాంతాల్లో రెయిన్ వాటర్ డైవర్షన్ పనులు అసంపూర్తి గా ఉన్నాయని విటిని తరిత గతిన పూర్తి చేయాలన్నారు. రోటరీ నగర్ నుంచి కబెళా మీదుగా రామరాజ్య నగర్ తదితర ప్రాంతాల్లో ముంపు కు గురి కాకుండా వర్షపు నీరు పారుదల కు అనుగుణంగా కాలువలను వెడల్పు చేసే పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజలు మానసిక శారీరక వికాసానికి నిలయమైన గాంధీ పార్క్ వంటి పార్క్ స్థలాల్లో అవసరమైన చిన్నారులు ఆడుకునే అట వస్తువులతో పాటు జిమ్ కు అవసరమైన సామాగ్రిని సమకూర్చాలని నగర పాలక సంస్థ అధికారులకు ఆదేశించారు. కబెలా సెంటర్ లో ఉన్న ఉర్దూ గవర్నమెంట్ జూ కాలేజ్ ను వించి పేటలో ఉన్న ఉర్దూ స్కూల్ లో కాలి భవనం లోకి మార్పు చెయ్యాలని విద్యార్థుల తల్లదండ్రులు కోరికను పరిశీలిస్తామన్నారు. పర్యటనలో బాగంగా ఉర్దూ స్కూల్ మరియు కాలేజ్ ను
సందర్శించిన మంత్రి గారు ఉర్దూ స్కూల్ కు కావలసినమౌలిక సదుపాయాల ను ఎర్పాటు చెయ్యాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పర్యటనలో నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేశ్
ఐఏఎస్,ఎస్.ఇ. రామ్ మూర్తి, చీప్ మెడికల్ అధికారి డా. కే అర్జున్ రావు, ఎగ్జక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వర రావు, మరియు ఇతర అధికారులు పార్టీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్,రాష్ట్ర సహాయ కార్యదర్శి మైలవరపు దుర్గా రావు, నగర కార్యదర్శి పదిలం రాజశేఖర్,అప్పాజీ, వెన్నం రజనీ, కురాకుల నాగ, గ్రంది బుజ్జి, పోలిమెట్ల శరత్, మజ్జి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.

Related Posts