యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తిరుమలలో భారీ చోరీ జరిగింది. భక్తులు బస చేసిన మణిమంజరి అతిథి గృహంలో చోరీగాళ్లు తమ చేతివాటం చూపించారు. 10 తులాల బంగారు నగలు, డైమండ్ నెక్లెస్, రూ.2 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు అపహరణకు గురైనట్లు బాధితులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన మొత్తం 13 మంది భక్తులు మంగళవారం (జులై 2) రాత్రి మణిమంజరి అతిథి గృహంలో బసచేశారు. రాత్రి వీరందరూ గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగతనం జరిగినట్లు తెలిపారు. బాధితులు ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సమీప బంధువులని తెలుస్తోంది. భక్తుల ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విజిలెన్స్, పోలీసు అధికారులు మణిమంజరి అతిథి గృహం చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు.