వేసవి కాలమైన చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆయా కాలాలను ఆనందంగా గడపవచ్చని నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేసవి నుంచి వర్షాకాలం వచ్చినా వర్షాకాలం నుంచి శీతాకాలం వచ్చినా వాటి ప్రభావం సాధారణంగా ప్రజలపై పడుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుత వర్షాకాలంలో చుట్టపక్కల పరిస్థితులు పూర్తి కాలుష్యభరితంగా ఉంటాయి. దాంతో సాధారణంగా జలుబు, దగ్గు వంటి సాధారణ వ్యాధులతో పాటు కలుషితమైన ఆహారం, నీరు వంటి వాటిని స్వీకరించడంతో భయకరమైన కలరా, డిఫ్తీరియా వ్యాధులు సోకుతాయంటున్నారు. ముఖ్యంగా ఇటువంటి వ్యాధులు చిన్నపిల్లల్లో త్వరగా వ్యాపిస్తాయని చెబుతున్నారు.ప్రస్తుత వర్షాకాలంలో పిల్లల తల్లిదండ్రు లు వారి ఆరోగ్య రక్షణకు ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా వ ర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నుంచి సురక్షితం గా బయటపడవచ్చని చెబుతున్నారు. పిల్లల ఆరోగ్య రక్షణ కు వారిని జంకు ఫుడ్ (ఫాస్ట్ పుడ్స్), దూరంగా ఉంచాలంటన్నారు. ముఖ్యంగా క్యాంటిన్ ఫుడ్, బయట దొరికే పానీ పూరీ, కట్లెట్ వంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మురునీరు బయటకు పారే విధంగా ఏర్పాట్లు ఉన్నాయా? లేదా ? లేక పోతే వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సింది పాఠశాల నిర్వాహకులు మీద ఒత్తిడి తీసుకు రావాలంటున్నారు.అంతే కాకుండా ఆయా ప్రాం తాల్లో నీరు నిల్వఉండకుండా చేయాలని, మురికి గుంటలు
అక్కడ ఉన్నట్లయితే వాటి నివారణకు చ ర్యలు తీసుకోవాలి, ము ఖ్యంగా మంచినీటికి సంబంధించిన జా గ్రత్తలు తీసుకోవాలి.విద్యార్థులు తాగే నీటిని ఎప్పటికప్పుడు మార్చాలి. అందుకు సంబంధించి ట్యాం కులు,ఫిల్టర్లను శుభ్రంగా ఉం డేలా చర్యలు తీసుకోవాంటున్నారు. లేక పోతే పిల్లలకు అ త్యంత ప్రమాదకరమైన డెం గ్యూ,మలేరియా వంటి వ్యాధులు ప్ర బలే అవకాశం ఉంటుందన్నారు. సాధారణంగా విద్యార్థులకు గోళ్ళను కొరికే అలవాటు ఉంటుందని, దాన్ని వెంటనే వారిచేత మాన్పించాలన్నారు. లేక పోతే గోళ్ళలో ఉండే మట్టిద్వారాబ్యాక్టీరియా వారి నోటిలోకి చేరి తద్వారా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందంటున్నారు.అంతే కాకుండా వారి చేతి గోర్లను ఎప్పటిప్పుడు కట్ చేయడం ద్వారా వాటిలో మట్టి చేరే అవకాశం లేకుండా చేయవచ్చన్నారు. విద్యార్థులు ఎప్పడు పొడి దుస్తులు ధరించే విధం జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం తడిగా ఉన్నా వాటిని వెం టనే మార్చడం ద్వారా సాధారణంగా వారికి వచ్చే దగ్గు,జలుబులు నివారించ వచ్చన్నారు. అంతే కాకుండా విద్యార్థుల రక్షణకు ప్రత్యేంగా ఈ వర్షాకాలంలో అందుబాటులో డాక్టర్లను ఉండేలా చూడటం కాని లేదా వాటికి సంబంధించిన మందులను అం దుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా పాఠశాల భ వనాలను ప్రస్తుత వర్షాకాలంలో బాగా తడిచి ఉంటాయని దాంతో విద్యుత్ షా ర్ట్‌సర్కూట్ అయ్యే అ వకాశం ఉందంటున్నా రు. వేలాడుతూ ఉం డే స్విచ్ బోర్డులు, కరె ంట్ తీగలు, కరెంట్ ప్లగ్‌లను వం టి విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు.