YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అందరి ఆశలు బడ్జెట్ పైనే ఊరిస్తారా... ఊసూరుమనిపిస్తారా

అందరి ఆశలు బడ్జెట్ పైనే ఊరిస్తారా... ఊసూరుమనిపిస్తారా

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఎన్నో ఆశలు.. మరెన్నో సవా ళ్లు.. అంతకు మించిన లక్ష్యాల మధ్య కేంద్ర బడ్జెట్‌ను మోసుకొస్తు న్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సార్వత్రిక ఎన్నికల దృ ష్ట్యా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌తోనే సరిపెట్టగా, అప్పటికీ.. ఇప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితుల్లో చాలానే మార్పు వచ్చింది. జనవరి-మార్చి మధ్య కేవలం 5.8 శాతం వృద్ధిరేటే నమోదైంది. ఇది అంచనాల కంటే చాలా తక్కువ. ఇక వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో పడటం లేదు. దేశీయ వ్యవసాయ రంగం వర్షాలపైనే అధికంగా ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. జీడీపీలో వ్యవసాయం వాటా కూడా ఎక్కువేనన్న సంగతి విదితమే. జూన్‌లో వర్షాభావ పరిస్థితులు గడిచిన వందేండ్లలో ఐదో అత్యంత దారుణమైనవని గణాంకాలు చెబుతున్నాయి. దీనివల్ల వినియోగదారుల కొనుగోళ్ల శక్తి దెబ్బతిని మార్కెట్లు మందగమనంలోకి వెళ్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా మొత్తం ఆర్థిక వ్యవస్థే కుంటుబడుతుందని అంటున్నారు. అందుకే వృద్ధిదాయక బడ్జెట్ అవసరమని
చెబుతున్నారు.సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు తదితర కారణాలతో సర్కారీ వ్యయం కొండంత అవుతున్నది. దీంతో ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక లక్ష్యాలపై అప్రమత్తత అవసరమని, అవసరమైన వాటికి తప్ప, అనవసరమైన వాటికి బడ్జెట్ కేటాయింపులు తక్కువగా చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం జీడీపీలో ప్రభుత్వ స్థూల రుణాల విలువ దాదాపు 70 శాతంగా ఉన్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి వచ్చే ఆదాయం అంతంతమాత్రంగా ఉన్న వేళ ద్రవ్యలోటు గతి తప్పకుండా బడ్జెట్‌లో సీతారామన్ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.స్టార్టప్‌లకు మరిన్ని నిధులు అందేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని, ఉత్పాదక రంగాన్ని బలపరిచేలా ప్రోత్సాహకభరిత రుణ సదుపాయాలను కల్పించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. స్టార్టప్‌లకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)ల కోసం వృద్ధికారక నిధిని ఏర్పాటు చేయాలని సిగ్మా వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ నిల్యాంక భూషణ్ విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్తదనానికి, ప్రతిభకు పట్టం కట్టాలంటే స్టార్టప్‌లను ప్రోత్సహించాలని గుర్తుచేశారు.బాలల సంక్షేమ పథకాల కోసం బడ్జెట్‌ను
పెంచాలని బాలల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఎన్జీవోలు డిమాండ్ చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోగల చిన్నారుల భద్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాయి. సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), సమగ్ర శిక్షా అభియాన్ కింద టీచర్స్ ఎడ్యుకేషన్ వంటి వాటికి బడ్జెట్‌లో మరింత ప్రాధాన్యతనివ్వాలని కోరాయి. బడ్జెట్‌లో శానిటరీవేర్ ఉత్పత్తులపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు ఈ రంగ ఇండస్ట్రీ వర్గాలు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చ్‌భారత్ పథకంతో శానిటరీవేర్ ఉత్పత్తులు తక్కువధరకు సామాన్యులకు అందించాలంటే జీఎస్టీని తగ్గించాలని శానిటరీవేర్ తయారీదారుల సంఘం కౌన్సిల్ డైరెక్టర్ ఆర్‌బీ కాబ్రా తెలిపారు. శానిటరీవేర్ ఉత్పత్తుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదని, ఇప్పటికీ కేవలం 60 శాతం మంది మాత్రమే వీటిని వాడుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంచనావేస్తున్నారు. పొరుగు దేశాల్లో 90 శాతానికి పైగా ఉన్నది. బాత్‌రూంలలో బిగించే నల్లలపై కూడా 18 శాతం పన్ను విధిస్తున్నారు. నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నగదు కొరతను తీర్చాలని రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు. 2022కల్లా హౌజింగ్ ఫర్ ఆల్ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరుపాలని కోరుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు అందేలా, ఇండ్ల కొనుగోళ్లు పెరిగేలా కొనుగోలుదారులకు పన్ను ప్రోత్సాహకాలు
ప్రకటించాలని  సూచిస్తున్నారు. ద్రవ్యలోటును కట్టడి చేయడం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట ఇప్పుడున్న పెద్ద సవాల్‌గా కనిపిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 3.4 శాతంగా ఉండొచ్చని మధ్యంతర బడ్జెట్‌లో మోదీ సర్కారు అంచనా వేసింది. ఇదే సమయంలో రాయితీల భారం పెరుగుతుందన్న ఆందోళననూ కనబరిచింది. ఈ క్రమంలో వీటిని సమతూకం చేస్తూ బడ్జెట్‌ను సీతారామన్ ప్రవేశపెట్టాల్సి ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ప్రభుత్వ స్థూల ఆదాయం రూ.1.46 లక్షల కోట్లు తగ్గవచ్చని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ప్రాథమిక అంచనా. అయితే సవరించిన అంచనాల ప్రకారం ఇది 14.8 లక్షల కోట్లు. ఇందుకు కారణం పడిపోయిన పన్ను వసూళ్లే. ఇక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. మోదీ సర్కారు అప్పులను తప్పుబట్టింది. మితిమీరిన రుణాలు చేస్తున్నారంటూ కాగ్ విమర్శించింది. ఈ క్రమంలో సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Related Posts