YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హైద్రాబాద్ కు షా

హైద్రాబాద్ కు షా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారు. జూలై 6న ఆయన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ లక్షణ్ తెలిపారు. హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని షా ప్రారంభిస్తారని లక్ష్మణ్ చెప్పారు. అలాగే కొత్తగా పార్టీలో చేరే నేతలను అమిత్ షా కు పరిచయం చేస్తామన్నారు. చేరికలు నిరంతర ప్రక్రియ అని, చాలా మందితో సంప్రదింపులు జరుపుతున్నామని లక్ష్మణ్ అన్నారు. ఈసారి అదనంగా 40 శాతం సభ్యత్వాన్ని పెంచబోతున్నామని చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని లక్ష్మణ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణలో బలపడే అంశంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి అహ్వానిస్తున్నారు. పెద్ద ఎత్తున బీజేపీలో తెలంగాణ నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ వేశారు. అమిత్ షా సమక్షంలో పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యలు బీజేపీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీ కండువా కప్పుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక.. అమిత్
షా తొలిసారి హైదరాబాద్ వస్తున్నారు.

Related Posts