Highlights
- ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ విధానంతో
- టిన్ అల్లాయ్ మిశ్రమం
- ఆవిరి రూపంలో బంగారు పూత
నటనా రంగంలోని వారికి ఆస్కార్ అవార్డ్ కల. ఒక్కసారైనా ఆస్కార్ ను అందుకోవాలని ఆశపడని నటీనటులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి ఆస్కార్ అవార్డు కాలం గడిచే కొద్దీ రంగుకోల్పోతుండడంతో ఆందోళన వ్యక్తమయింది. దీనికి పరిష్కారంగా ఆస్కార్ నిర్వాహకులు నాసాను సంప్రదించారు. దీంతో నాసా ఎప్నర్ టెక్నాలజీస్ సేవలందించేందుకు ముందుకు వచ్చింది. ఎప్నర్ టెక్నాలజీస్ 1970 నుంచి నాసాతో కలిసి పనిచేస్తోంది.ఆస్కార్ ట్రోఫీ రూపకల్పన కోసం తయారీదారులు టిన్ అల్లాయ్ మిశ్రమాన్ని వినియోగిస్తారు. గతంలో వేసే ఆవిరి కోటింగ్ స్థానంలో లేజర్ గోల్డ్ గా పిలిచే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ ను ఈ సారి ఆస్కార్ అవార్డు ప్రతిమల రూపకల్పనలో వినియోగించారు. దీంతో ఆస్కార్ ప్రతిమ మరింత ప్రకాశవంతంగా మారడమే కాకుండా, ఆ వర్ణం ఎన్నటికీ చెరిగిపోదని ఎప్నర్ టెక్నాలజీస్ చెబుతోంది.