YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పరువు నష్టం దావా ముంబై కోర్టుకు వచ్చిన రాహుల్

పరువు నష్టం దావా ముంబై కోర్టుకు వచ్చిన రాహుల్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పరువునష్టం కేసులో ముంబై స్థానిక కోర్టుకు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం నాడు ఉదయం హాజరయ్యారు.  జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్య విషయంలో ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ విషయమై మేజగోన్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరిలో రాహుల్ గాంధీతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సమన్లు పంపింది. లాయర్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ధరుతిమాన్ జోషి పరువునష్టం దావా వేశాడు.  2017లో జోషి రాహుల్ గాంధీతో పాటు సీతారాం ఏచూరిపై కేసు వేశారు.  
2017 సెప్టెంబర్ మాసంలో బెంగుళూరులో గౌరీ లంకేష్ తన ఇంటి వద్దే హత్యకు గురయ్యారు.  రైట్ వింగ్ గ్రూప్కు చెందిన కార్యకర్తలు ఈ దాడి చేశారని విమర్శించారు. గౌరీ లంకేష్ హత్యకు గురైన విషయమై అప్పట్లో రాహుల్ స్పందించారు.  
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడితే బెదిరింపులు, కొట్టడం లేదా ఇలా చంపేస్తున్నారరి వ్యాఖ్యానించారు.
ఆర్ఎస్ఎస్ కు చెందిన వాళ్లే ఈ దాడి చేశారని ఆమె సీతారాం ఏచూరి ఆరోపించారు.  ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలపై జోషి పరువు నష్టం దావా వేశారు.  ఈ కేసు విషయమై రాహుల్ గురువారం నాడు ముంబై కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్బంగా కోర్లు అయనకు పదిహేను వేల రూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బయట అయన మీడియాతో మాట్లాడారు. నాపై దాడులు జరుగుతున్నాయి. దాడులను ఎంజాయ్ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాహుల్ కోర్టుకు వచ్చెటప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అయన స్వాగతం పలికారు. నేనేప్పూడూ పేదలు, రైతుల పక్షాన వుంటాను. ప్రభుత్వంపై మరింత పోరాటం చేస్తానని అయన అన్నారు.

Related Posts