YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది

ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఇకపై నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తా. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. త్వరలో మండలాలవారిగా సమావేశాలు నిర్వహిస్తాం. కష్ట పడి పని చేసిన కార్యకర్తలు, నాయకులకి సరైన గుర్తింపు ఇస్తామని అయన అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు. గురువారం అయన  మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సమావేశమైయ్యారు. ఈ భేటీలో  పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల పై చర్చ జరిగింది. లోకేష్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజా వేదిక కూల్చివేత పై ఉన్న శ్రద్ధ రైతులకు విత్తనాలు పంపిణీ విషయంలో పెట్టలేదు. ఏ కార్యక్రమం పై సరైన స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటాం.ఏ కార్యక్రమం ఆపేసినా ప్రజా ఉద్యమం చేపడతాం. ముఖ్యమంత్రి కి అవగాహన లేదు అనే విషయం బయటపడకుండా గత ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. వైఎస్ గారు అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 60 కి పైగా కార్యకర్తలను హత్య చేయించారు. తన తండ్రి పంథాలో ప్రజలను పక్కన పెట్టి జగన్ గారు టిడిపి కార్యకర్తల పై దాడులు చేయిస్తూ 6 టిడిపి కార్యకర్తలను హత్య చేయించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని అటక ఎక్కిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎత్తేసారు, రాజధాని పనులు ఆపేసారు, కౌలు డబ్బులు వెయ్యడం లేదు,కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి,రైతులకు విత్తనాలు సరఫరా చెయ్యడం లేదని మండిపడ్డారు.

Related Posts