YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు కలెక్టరేట్ లో అల్లూరి జయంతి

కర్నూలు కలెక్టరేట్ లో అల్లూరి జయంతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

స్వాతంత్రోద్యమ విప్లవకారుడైన అల్లూరి సీతారామరాజు ఏ లక్ష్యంతో కృషి చేసారో గుర్తించు కొని సమాజ అభివృద్దికి అందరం కలిసి కట్టుగా సహకారం  అందించాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు.  గురువారం కలెక్టర్  కార్యాలయ సమావేశ భవనంలో అల్లూరి సీతారామరాజు 123వ జంయతి  ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జాంయిట్ కలెక్టర్ పటాన్ శెట్టి రవి సెభాష్, జెసి-2 మణిమాల, డిఆర్ ఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.  అల్లూరి సీతారామరాజు  చిత్రపటానికి పూల మలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై అనేక పోరాటాలు చేసి ప్రాణత్యాగం  చేసిన మహోన్నత వ్యక్తి  అల్లూరి సీతారామరాజని కొనియడారు. ఏ లక్ష్యం కోసమైతే కృషి చేసారో ఆ సమున్నత లక్ష్యాని ఆచరణలోకి తీసుకొని సమాజ అభివృద్దికి అందరు పాటుపడాలన్నారు.  గత రెండు సంవత్సరాల కాలం నుండి వివిధ ఎన్నికల కోడ్ అమలులో వున్నందున ఉత్సవాలు నిర్వహించ లేకపోయామని,  భవిష్యత్లో  అల్లూరి సీతారామరాజు ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటానన్నారు. జిల్లా గిరిజన సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ ఈ సందర్భంగా చేపారు. షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కైలస్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు, గిరిజన సంక్షేమ అధికారి ధనుంజయ, డ్వామా పిడి వెంకటసుబ్బయ్య, డిసిఓ సుబ్బారావు, కలెక్టరేటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts