YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల త్రాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం. . ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ ఆదేశం

తిరుమల త్రాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం. . ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ ఆదేశం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తిరుమల లో త్రాగునీటి సమస్య శాశ్వతంగా శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్  వై వి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ శాఖను ఆదేశించారు గురువారం పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన  తిరుమల త్రాగు నీటి అవసరాలు లభ్యత ప్రత్యామ్నాయ మార్గాలు తదితర అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి తిరుమల జెఇఓ బసంత్ కుమార్,   ఇంజనీరింగ్ సి ఈ మురళి నాథ్ రెడ్డి,  ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి సమగ్ర వివరాలను చైర్మన్ కు అందించారు.  తిరుమలకు ఏటా 0.5 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులలో వాతావరణంలో మార్పులు కారణంగా అక్టోబర్ నాటికి నీటి నిల్వలు పడిపోతాయని తెలిపారు. తిరుమలలో పాపవినాశనం గోగర్భం డ్యామ్, పసుపుధార,  కుమారధార,  కళ్యాణి డ్యామ్ తెలుగు గంగ నుంచి నీటిని పొందుతున్నామని వీటిలో  ప్రస్తుతం నీటి లభ్యత లేకపోవడంతో సమస్య తలెత్తుతుందని వివరించారు.  అనంతరం బాలాజీ రిజర్వాయర్ ద్వారా నీటి పంపిణీ చేయడానికి సాధ్యాసాధ్యాలను గురించి చర్చించారు బాలాజీ రిజర్వాయర్ను  త్వరగా పూర్తి చేయడం ద్వారా సమస్య కొంత మేర  పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు చైర్మన్ కు వివరించారు దాని నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  అంతేకాకుండా పదిహేను రోజుల లోపు ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి సంపూర్ణ స్థాయి నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Related Posts