యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గుంతకల్ డివిజన్ పరిధిలో బెంగళూరు మరియు విజయవాడ ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ట్రైన్ నంబర్ 56503 బెంగుళూరు నుండి విజయవాడ వెళ్లే ప్యాసింజర్ మరియు ట్రైన్ నెంబర్ 56504 విజయవాడ నుండి బెంగళూరు వెళ్ళు ప్యాసింజర్ రైళ్లను రైల్వే పనుల పునరుద్ధరణ కారణంగా దాదాపుగా రెండు నెలలపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలియజేశారు.జూలై 4 నుండి ఆగస్టు 29 వరకు ఈ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు,ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలియజేశారు.ఆగస్టు 30 నుండి విజయవాడ మరియు బెంగుళూరు ప్యాసింజర్ రైళ్లు యధావిధిగా పని చేస్తాయని వారు తెలియజేశారు.