Highlights
- ఆనాటి నుంచే ఎస్ ఎస్ సీ పరీక్షలు కూడా
- పాఠశాల విద్యాశాఖ నిర్ణయం
రాష్ట్రంలో ఆదిలోనే వేసవి తాపం తన ప్రతాపాన్ని చూపుతుంది. దీనితో ప్రభుత్వం విద్యార్థుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులను నడుపాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. త్వరలోనే జిల్లా విద్యాధికారులకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని హైస్కూళ్లలో చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఉన్నత పాఠశాలలు దగ్గరలో లేని బాలికలను గుర్తించి, వారికి సైకిళ్లను పంపిణీ చేయాలని భావించారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు.