యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
లోక్‌సభలో ఇవాళ ఆధార్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆధార్‌కు బదులుగా రేషన్ కార్డు, పాస్‌పోర్టు లాంటి ద్రువీకరణ పత్రాలను కస్టమర్లు మొబైల్ కంపెనీలకు సమర్పించవచ్చు అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో 123.81 కోట్ల ఆధార్ కార్డులు జారీ అయినట్లు మంత్రి చెప్పారు. సుమారు 69 కోట్ల మొబైల్ ఫోన్లకు ఆధార్ లింకు అయినట్లు మంత్రి తెలిపారు. 65 శాతం బ్యాంకు అకౌంట్లకు కూడా ఆధార్ లింకైందన్నారు. లోకాస్ట్ టెక్నాలజీతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించవచ్చు అని, శాస్త్రవేత్తలు ఆ ఉద్ధేశంతోనే ఆధార్‌ను డెవలప్ చేసినట్లు మంత్రి రవిశంకర్ చెప్పారు