YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ ఇంటి దగ్గర డ్రోన్స్ సెక్యూరిటీ

జగన్ ఇంటి దగ్గర డ్రోన్స్ సెక్యూరిటీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి భద్రత పెరిగింది. పోలీసుల సెక్యూరిటీకి తోడు డ్రోన్లను కూడా రంగంలోకి దించారు. రాజధాని ప్రాంతంలోని తాడేపల్లిలో ఉన్న జగన్ నివాసం చుట్టూ మూడు డ్రోన్‌లతో నిఘా పెంచారు. జగన్ ఇంటి చుట్టూ 200 మీటర్ల ఎత్తులో ఈ డ్రోన్లు రోజూ పహారా కాస్తుంటాయి. ఈ ఫుటేజ్‌ను మంగళగిరిలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న టెక్ టవర్‌లో పోలీసులు పరిశీలిస్తుంటారు. వీటికి తోడు నివాసం సమీపంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. జగన్ నివాసానికి వెళ్లే దారిలో ట్రాఫిక్‌తో పాటూ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా.. కాన్వాయ్‌కు రూట్ క్లియర్ చేయడం.. ఇంటి చుట్టూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారా లేదా అని అంశాలను ఈ డ్రోన్ల ద్వారా పరిశీలించనున్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సీఎంవోతో పాటూ కాన్వాయ్‌లో ఉండే సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేయనున్నారు. ఇక సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు. ముందస్తు జాగ్రత్తగా డ్రోన్ కెమెరాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. రెండు మూడు రోజులుగా నిరుద్యోగులతో పాటూ మరికొందరు సీఎం నివాసంవైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. కాన్వాయ్‌కు అడ్డుపడే ప్రయత్నం చేశారు. అలాగే ఆగస్టు నుంచి ప్రజా దర్భార్ నిర్వహిస్తున్నారు. కాబట్టి జగన్ నివాసానికి ప్రజల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇలా వరుస ఘటనలతో అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు

Related Posts