YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

ఉచితం.. ఉచితం.. ఉచితం

ఉచితం.. ఉచితం.. ఉచితం

ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు  .ఇంటి ముందు కాపలాగా  ఒక కుక్క ఉన్నింది .దొంగను చూసింది కానీ ఏ చప్పుడు చేయకుండా చూస్తూ ఉంది అతన్ని  చూసి మొరగని  కుక్కను  చూసి దొంగ ఆలోచనలో  పడ్డాడు. దొంగతనానికి వెళదామా ?? వద్దా  ?? అని ఇంటి లోపలకు వెళ్ళాక కుక్క అరిచిందంటే  ఏం చేయాలి. ఇప్పుడే అరిచినా  వేరే ఇంటికి దొంగతనానికి వెళ్లొచ్చు  అని అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ చివరగా తాను తెచ్చిన రొట్టెముక్కను  కుక్కకు విసిరాడు. అంతే వెంటనే ఆ కుక్క గట్టిగ అరుస్తూ  అతని వెంటపడి కొరకడానికి  ప్రయత్నించింది . అప్పుడు దొంగ కుక్కను చూసి నన్ను చూసికూడా  అరవని నువ్వు ఇప్పుడు రొట్టె  ముక్క ఇవ్వగానే అరుస్తున్నావు ఏంటి అని అడిగాడు నువ్వు ఊరికే ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఈ ఇంటి బంధువో  లేక తెలిసిన వ్యక్త్తో  అయిఉంటావని  అనుకున్నాను కానీ ఎప్పుడైతే నువ్వు నాకు ఉచితంగా రొట్టెముక్క  ఇచ్చావో  అప్పుడే అర్థం అయింది నువ్వు దొంగవని  అని చెప్పింది కుక్క... ఆలోచించవలసిన విషయమే కదండీ ఇది
ఉచితం అనగానే  ఆలోచన మరిచి ఎగబడిపోతున్నారు  జనాలు. ఉచితంగా ఇచ్చారంటే  అందులో ఎంతటి అర్థం ఉందో అర్థం చేసుకున్నది ఈ కుక్క కానీ మషులమైన  మనమే ఉచితంగా ఎందుకు ఇస్తునారో గ్రహించలేక  పోతున్నాం..  కుక్క గ్రహించినంత  కూడా మానవులం  గ్రహించలేకపోతున్నాం.

Related Posts