యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం మంది ప్రజలు టీడీపీకి ఓటేశారనీ, వారందరిని రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు పెరిగిపోవడం దారుణమని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అసూయలు, అపోహలు వదిలేసి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు ఈ నెల 9న కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు.