యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
సెమీస్ కు చేరడానికి పాకిస్థాన్ కు దాదాపు అన్ని దారులు మూసుకుపోయాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి... సెమీస్ బర్త్ సాధించాలంటే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో 450కి పైగా పరుగులు సాధించాలి. అంతేకాదు, బంగ్లాను 316 పరుగుల తేడాతో ఓడించాలి. ఆసక్తిర విషయం ఏమిటంటే... ఈ మ్యాచ్ లో టాస్ కూడా అత్యంత కీలకం కాబోతోంది. టాస్ గెలిచి బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ తీసుకుంటే... పాకిస్థాన్ కథ ముగిసినట్టే. 316 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలవాలంటే... బంగ్లాదేశ్ ఎన్ని పరుగులు చేయాల్సి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయితే, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం సెమీస్ కచ్చితంగా చేరుతామనే దీమాతో ఉన్నాడు. బాంగ్లాదేశ్ తో జరగనున్న చిట్టచివరి మ్యాచ్ లో 500 పరుగులు సాధించేందుకు యత్నిస్తామని చెప్పాడు.