Highlights
- మూడు రోజుల పాటు సింగపూర్, మలేషియాల్లో పర్యటన
- భారతీయ ఉద్యోగులు, వ్యాపారులతో భేటీ
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు విదేశీయానం చేయనున్నారు. ఈ నెల 8 నుంచి ఆయన మూడు రోజుల పాటు సింగపూర్, మలేషియాల్లో పర్యటించనున్నారు. సింగపూర్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం ఉంటుంది. అనంతరం భారత ప్రొఫెషనల్స్, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అవుతారు. సింగపూర్ పర్యటన తరువాత మలేషియాకు వెళ్లి భారతీయ ఉద్యోగులు, వ్యాపారులతో భేటీ అవుతారు. ఇది ఇలా ఉండగా ఈశాన్య రాష్ట్రాల్లో ఓటెవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ చేపట్టబోయే పర్యటించడంపై సర్వత్రా విమర్శలు విన వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉంటే వాటిని విస్మరించి మరి రాహుల్ విదేశాలకు పయనమవడం పార్టీ వర్గాల నుండి సైతం విమర్శలు వస్తుండడం గమనార్హం.