YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి అన్యాయం జరిగింది

ఏపీకి అన్యాయం జరిగింది

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పార్లమెంటులో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదని, ఏపీకి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని, విభజన చట్టంలోని అంశాలపై ఏం మాట్లాడలేదని, విశాఖ, విజయవాడ మెట్రో నిధుల విషయంలో అన్యాయం జరిగిందని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, పోలవరం, అమరావతి నిర్మాణంపై నిధుల ప్రస్తావనే లేదని అన్నారు. జీరో బడ్టెట్ వ్యవసాయంపై స్పష్టత లేదని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల వరకు పెరిగిందని వెల్లడించారు. ఈ బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆశలు పెట్టుకుందని, రాష్ట్రానికి తప్పకుండా సహాయం చేస్తామని కేంద్రం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం హామీలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. పోలవరం, అమరావతిపై నిధుల ప్రస్తావన పెద్దగా లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడం కోసం ఏ పోరాటానికైనా తాము సిద్ధమని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

Related Posts