YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వ్యవ‌సాయ‌రంగంలో ప్రైవేటు వ్యాపారుల‌ు

వ్యవ‌సాయ‌రంగంలో ప్రైవేటు వ్యాపారుల‌ు

వ్యవ‌సాయ‌రంగంలో ప్రైవేటు వ్యాపారుల‌ను ప్రోత్స‌హించ‌నున్నారు. వ్య‌వ‌సాయ రంగానికి మౌళిక స‌దుపాయాలు క‌ల్పించే అంశంపై మోదీ స‌ర్కార్ దృష్టి పెట్టిన‌ట్లు ఆర్థిక మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ తెలిపారు. ఇవాళ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతూ ఆమె మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌, ఈజ్ ఆఫ్ లివింగ్‌.. రైతుల‌కు కూడా చెందాల‌న్నారు. జీరో బ‌డ్జెట్ వ్య‌వ‌సాయాన్ని రైతులు ఆశ్ర‌యించాల‌న్నారు. రైతుల‌కు ఇది కొత్త మోడ‌ల్‌గా ఉండాల‌న్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంద‌న్నారు. గ్రామాలు, పేదలు, రైతుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నట్లు సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగానే ‘జీరో బడ్జెట్‌ ఫామింగ్‌’ విధానంపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. పెట్టుబడి లేకుండా చేసే వ్యవసాయం ద్వారా రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారపడకుండా.. చిన్న వ్యయాలతో అంతరపంటలు వేసి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో ప్రధాన పంటలకు పెట్టుబడి పెట్టుకోవచ్చన్నారు కేంద్రమంత్రి. ఈ విధానం కొత్తదేమీ కాదని.. దేశమంతా ఈ విధానాన్ని అవలంబించేలా చూస్తామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపయ్యేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు. నీటి నిర్వ‌హ‌ణ చూస్తున్న మంత్రిత్వ‌శాఖ‌ల‌ను ఏకం చేసి జ‌ల‌శ‌క్తి మంత్రాల‌యాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు. ప్ర‌తి ఇంటికి 2024లోగా నీటి అందించ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌ల‌శ‌క్తి శాఖ కోసం నిధుల‌ను స‌మీకిరిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 9.6 కోట్ల మ‌రుగుదొడ్లు నిర్మించామ‌న్నారు. 5.6 ల‌క్ష‌ల గ్రామాలు బ‌హిర్భూమి నుంచి విముక్తి పొందాయ‌న్నారు. సుమారు 2 కోట్ల గ్రామీణ ప్ర‌జ‌లు డిజిట‌ల్ అక్ష‌రాస్యత సాధించార‌న్నారు.

Related Posts