YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ పన్నులకు షాక్

మోడీ పన్నులకు షాక్

మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగుల ఆశలపై నీళ్లుజల్లింది. వరాలు ఉంటాయని ఆశించిన వీరికి ఝలక్ ఇచ్చింది. వరాలు ఇవ్వకపోగా మరింత వడ్డింపు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదనల వల్ల ఉద్యోగులపై మరింత భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఉద్యోగులు సహా పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శ్లాబ్‌లను కేంద్రం తగ్గిస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు వారికి నిరాశ మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా సర్ చార్జీలను పెంచింది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్యలో పన్ను ఆదాయం కలిగిన వారు ఇకపై పన్నుపై 3 శాతం ఎక్కువ సర్‌చార్జీ చెల్లించాల్సి వస్తుంది. అదే ఏడాదిలో రూ.5 కోట్లపైన పన్ను ఆదాయం ఉంటే ఏకంగా 7 శాతం ఎక్కువ సర్‌‌చార్జీ కట్టాల్సి ఉంటుంది.

Related Posts