YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బడ్జెట్ ప్యాకింగ్ పై నెట్ జన్ల సెటైర్లు

బడ్జెట్ ప్యాకింగ్ పై నెట్ జన్ల సెటైర్లు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే అందరినీ ఆశ్చర్యపరిచారు. బ్రిటీష్ కాలం నాటి బ్రీఫ్‌కేస్ సాంప్రదాయానికి స్వస్తి పలికి.. ఎర్రని వస్త్రంలో బడ్జెట్ పత్రాలను చుట్టి పార్లమెంటుకు తీసుకురావడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే.. ఇంకొందరు వ్యగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను పెట్టుకుని పార్లమెంట్‌‌లో అడుగుపెడతారు. అయితే, నిర్మలా సీతారామన్ ఆ ఆనవాయితీని బ్రేక్ చేసి.. రాజముద్ర కలిగిన ఎర్రని వస్త్రంలో పత్రాలను పట్టుకుని పార్లమెంటుకు వచ్చారు. అలాగే.. ఆమె దీన్ని బడ్జెట్ అని కాకుండా.. బాహి ఖాటా (లెడ్జర్) అని చెప్పడం గమనార్హం. వాస్తవానికి బడ్జెట్ అనేది.. ఫ్రెంచ్ పదం బుగెటి నుంచి పుట్టుకొచ్చింది. బుగేటి అంటే బ్రీఫ్‌కేస్ అని అర్థం. ‘‘ఇది చాలా తెలివి తక్కువతనం. సాంప్రదాయాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది హిందూ సాంప్రదాయం కూడా కాదు. ఇండియన్ అంటే హిందూ కాదు. ‘ఇండియా’ అనేది 1947లో పుట్టింది’’ అని నీరజ్ గగోయ్ అనే యువతి తెలిపింది. ‘‘పార్లమెంటు కూడా పాశ్చాత్య దేశాల ఆలోచనే. దాని పేరును ‘చౌపాల్‌’గా మార్చండి’’
(హిందీలో బడ్జెట్‌ను చౌపాల్ అని పిలుస్తారు) అని ఇరానీ మ్యాన్ అనే ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశాడు.

Related Posts