డబ్బుకోసం మనిషిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలిమండలం లో చోటుచేసుకుంది.కర్నూలు జిల్లా తుగ్గలిమండలం సూర్యతాండ గ్రామానికి చెందిన రామునాయక్(50)హత్యకు గురైన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. రామునాయక్ తనకున్న 25 మేకలను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు.గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భార్య తెచ్చిన సద్దిని తిని,మేకలను మేపుటకు సమీపంలో ఉన్న కొండకు వెళ్ళాడు.రాత్రి వేళ అయినా భర్త, మేకల మంద ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది,జొన్నగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు,గ్రామప్రజలు కొండల్లో వేతకగా,బండరాయి వద్ద విగతజీవి గా పడివున్న రామునాయక్ ని గుర్తించారు. కుటుంబ సభ్యులు లు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.రామునాయక్ ని బండరాళ్లతోను,కర్రలతోను కొట్టి, అతిదారుణంగా హత్యచేసి,మేకలను అపహరించుకుపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు.జొన్నగిరి ఎస్సైలు సతీష్ కుమార్ మరియు విజయ్ కుమార్ లు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.సంఘటనా స్థలాన్ని డోన్ డిఎస్పి ఖాదర్ భాష మరియు పత్తికొండ సి.ఐ సోమశేఖర్ రెడ్డి లు పరిశీలించారు.పోలీస్ అధికారులు చనిపోయిన వ్యక్తిని పోస్టుమార్టం కొరకు పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.