YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ అవినీతి బయటపెడతాం

టీడీపీ అవినీతి బయటపెడతాం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గత ఐదేళ్లలో పేదలకు కట్టే ఇళ్లు కట్టే పధకం సంక్షేమం కాకుండా కుంభకోణం పధకంలా మారింది. పేదవాళ్ల కడుపులు కొట్టి స్కాం లకు పాల్పడటం సమంజసం కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు నీతి వ్యాఖ్యలు బోధిస్తున్నారు. సిఎం చేసిన జగన్ వ్యాఖ్యలు కక్ష పూరితం అంటూ ఎదురుదాడి చేస్తున్నారని మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. చ.అడుగు 1100 అయితే.. 2300గా మార్చి దోచుకున్నారు. ఇది రాజకీయ ఉపన్యాసం కాదు.. వాస్తవాలు చెబుతున్నాం. 25లక్షల ఇళ్లు వైయస్ హయాంలో కడితే.. టిడిపి కట్టినట్లుగా చెప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో కేవలం ఏడు లక్షల ఇళ్లు మాత్రమే కట్టింది వాస్తవం కాదా. సరికొత్త టెక్నాలజీ పేరు చెప్పి.. అధిక ధరలకు కాంట్రాక్టు అప్పచెప్పారని అయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనట్లుగా ఆర్భాటపు ప్రచారం చేశారు. పేదవాళ్లకు ఎన్ని ఇళ్లు ఇచ్చారు.. కనీసం ఒక్కటైనా అప్పగించారా. కేవలం దోచుకోవడానికే టెక్నాలజీ పేరు చెప్పుకుని పేదలను మోసం చేశారు. 350చ.అడు 6.55, 3.60చ.అ 7.55, 4.30చ.అ అయితే 8.55 లక్షలు. 2.65రూపాయలు లబ్దిదారుడు చెల్లిస్తే 3.50చ.అ జీ+3 హౌస్ ఇస్తారా అని నిలదీసారు. వైయస్ హయాంలో పూర్తి ఉచితంగా
జీ+ ఇళ్లు ఇచ్చాం. కేంద్రం నుంచి సాయం అందినా.. కేవలం దోచుకోవడానికే ప్రజల నుంచి టిడిపి ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది. నాలుగు ఏజెన్సీలకు 35ప్యాకేజీలను టిడిపి ప్రభుత్వం ఇచ్చింది. మాజీ మంత్రి
నారాయణ ఇప్పుడు 1600లకే కాంట్రాక్టు ఇచ్చినట్లు గా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. మేము ఆధారాలతో మీరు చేసిన దోపిడీ ని ప్రజల ముందు ఉంచుతున్నాం. ఈ అంశం పై చర్చించేందుకు నారాయణ ముందుకు రావాలని అయన అన్నారు.  తెలంగాణ లో చూస్తే చ.అ 1200, 1300 కు మాత్రమే ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఇక్కడ చ.అ తక్కువలో 1800చొప్పున వసూలు చేశారు. పేదవాడిని కూడా దోచుకుంది గాక, ఇంకా మాపైనే ఎదురుదాడి చేస్తారా. టిడిపి హయాంలో జరిగిన అవినీతి, దోపిడీ ని బయటపెట్టి తీరుతామని అన్నారు. పేదవాళ్లకు ఇచ్చే ఇళ్లు పూర్తి గా ఉచితంగా ఇవ్వాలని, పైసా కూడా తీసుకోవద్దని సిఎం జగన్ చెప్పారు అది పేదల పై జగన్ కు ఉన్న ప్రేమ ,ఆదరణ.. నారాయణ గారికి అన్ని లెక్కలను, అగ్రిమెంట్ చేసుకున్న అధికారిక పత్రాలను పంపిస్తాం. ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని దోచుకున్న డబ్బును ప్రజలకు తిరిగి చెల్లించండని అన్నారు.

Related Posts