YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పెరిగిపోతున్న వైకాపా వర్గీయుల అరాచకాలు మండిపడ్డ చంద్రబాబు

పెరిగిపోతున్న వైకాపా వర్గీయుల అరాచకాలు                     మండిపడ్డ చంద్రబాబు

అన్నిచోట్ల వైకాపా వర్గీయుల అరాచకాలు పెరిగిపోయాయని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా మద్దతుదారులను గ్రామాలు ఖాళీచేసి వెళ్లాలని వైకాపా వర్గీయులు బెదిరిస్తున్నారని, ఇళ్లపై సామూహిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పొలాలు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారని విమర్శించారు. అధికారం అండతో అరాచక శక్తులు పేట్రేగుతున్నాయని ద్వజమెత్తారు. తెదేపా కార్యకర్తల రక్షణ, వారి ఆస్తుల భద్రత మనందరి బాధ్యత అని అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తెదేపాకు 40 శాతానికి పైగా ప్రజలు ఓట్లు వేశారని వారందరినీ రక్షించుకోవడం మన కర్తవ్యమని చెప్పారు. 40రోజుల్లో ఆరుగురు తెదేపా కార్యకర్తలను హత్య చేయడం కిరాతకమన్నారు. తెదేపా సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబుశుక్రవారం  ఉదయం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నేరాలు ఘోరాలే వైకాపా విధానమని, ప్రజలే ఆ పార్టీని దూరం పెడతారని చంద్రబాబు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పరుచూరు నియోజవర్గంలో ఇటీవల చనిపోయిన తెదేపా కార్యకర్త పద్మ కుటుంబాన్ని ఇవాళ చంద్రబాబు పరామర్శించనున్న నేపథ్యంలో.. ఏ మహిళకూ ఎదురు కాకూడని పరాభవం తట్టుకోలేకే పద్మ ఆత్మహత్య చేసుకుందని అన్నారు. ఎస్సీలపై దాడులకు కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయమని, మిగతా సమయాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నదే తెదేపా సిద్ధాంతమని చంద్రబాబు స్పష్టం చేశారు. విత్తనాల కొరత, కరెంటు కోతల వంటి సమస్యలు ఏవి వచ్చినా సమస్యను తెదేపాపై తోసి జగన్‌ తప్పుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే
దాడులు, దౌర్జన్యాలతో వైకాపా నేతలు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Related Posts