Highlights
- అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే.. .
- మిత్రపక్షం కాబట్టే ఇన్నాళ్లు నిదానించాం
- ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ప్రసక్తే లేదు
- అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్య
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తే.. కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మంగళవారం శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ కింద విభజన హామీల అంశాలపై చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆనాడు రాజ్యసభలో ప్రధానమంత్రి ఏ అంశాలైతే చెప్పారో వాటన్నింటిని తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. అందులో ప్రత్యేక హోదా అంశం కూడా ఉందని గుర్తుచేశారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలన్నారు.
కేంద్రం పట్ల తాను సంయమనంతో వ్యవహరిస్తున్నానే తమ పరిధులు లోబడి ముందుకు పోతున్నామని చెప్పారు. విభజన హామిలపై ఇప్పటికీ 29సార్లు ఢిల్లీ వెళ్లినట్టు చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, మనోభావాలకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు. విభజన హామిల్లో 18అంశాలు పెట్టారని, అవన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మరోసారి ప్రస్తావించారు. మిత్రపక్షం కాబట్టే ఇన్నాళ్లు నిదానించామని చెపుతూ.. లేదంటే గట్టిగా ఫైట్ చేసి ఉండేవాడినని చంద్రబాబు పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనాలైతే కల్పించారో.. ఏపీకి కూడా అవి దక్కాలని డిమాండ్ చేశారు..ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను ప్రజల వైపే ఉంటానని స్పష్టం చేశారు.ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవానికి, మనోభావాలకు సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
Opposition party boycotting budget session is not good: Andhra Pradesh CM Chandrababu Naidu. pic.twitter.com/FV2e5jIyh8
— ANI (@ANI) March 6, 2018