YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

కడప జిల్లాల్లో టీడీపీ దిక్కేది

 కడప జిల్లాల్లో టీడీపీ దిక్కేది

వైసీపీ అధినేత వై.ఎస్.జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో చ‌రిత్ర సృష్టించాల‌ని భావించిన చంద్రబాబుకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఆయ‌న ఊహించింది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. అన్న విధంగా ప‌రిస్థితి

మారిపోయింది. నిజానికి టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో క‌డ‌పలో జ‌గ‌న్‌నే నేరుగా ఓడించేందుకు భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేశారు. దీనికి సంబంధించి ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. బీటెక్

ర‌విని ఎమ్మెల్సీగా ఎన్నుకోవ‌డంలో స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో ఇక‌, క‌డ‌ప‌లో పుంజుకు నేందుకు అవ‌కాశం ఉంద‌ని, వై.ఎస్. జ‌గ‌న్‌కు దిమ్మతిరిగేలా ఇక్కడ టీడీపీని పుంజుకునేలా చేయాల‌ని

భావించారు. సీఎం రమేష్ పై నమ్మకం పెట్టుకున్నారు.ఈ క్రమంలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ప్రముఖ వ్యాపార వేత్త సీఎం.ర‌మేష్‌కు చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటి వ‌ర‌కు ఉన్న

సీనియ‌ర్లను కూడా ప‌క్కన పెట్టి ఆయ‌నను రాజ్యస‌భ‌కు రెండు సార్లు ప్రమోట్ చేశారు. అంతేకాదు, రాష్ట్ర స‌మ‌స్యల‌పై గ‌ళం వినిపించే అవ‌కాశం కూడా ఇచ్చారు. దీంతో అనూహ్యంగా సీఎం ర‌మేష్

పుంజుకున్నారు. ఈ నేపథ్యంలోనే క‌డ‌ప ఉక్కు విష‌యంపై ర‌మేష్‌తో ధ‌ర్నా చేయించి, దాని ద్వారా క‌డ‌ప‌లో టీడీపీకి గుర్తింపు కోసం చంద్రబాబు పావులు క‌దిపారు. అయితే, అనూహ్యంగా జ‌గ‌న్

సునామీ ముందు టీడీపీ ఇక్కడి చిత్తుగా ఓడిపోయింది. ఎంపీ స‌హా అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ దిగ్విజ‌యంగా దూసుకుపోయింది.జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌, రాజంపేట ఎంపీ స్థానాల‌తో

పాటు 9 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఒక్క రాజంపేట సీటుకు ప‌రిమితం కాగా… ఇప్పుడు ప‌ది సీట్లలోనూ చిత్తుగా ఓడిపోయింది. ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో తీవ్ర

ఇబ్బందుల్లో కూరుకుపోయిన టీడీపీకి.. ఆ జిల్లాలో కీల‌క‌మైన నాయ‌కుడు, ప‌ది మందిని చేర‌దీసే నాయ‌కుడు సీఎం ర‌మేష్ బీజేపీలోకి జంప్ చేయ‌డంతో ఇప్పుడు పార్టీ ప‌రిస్తితి మ‌రింత దారుణంగా

త‌యారైంది. పోనీ ఉన్న నాయ‌కులైనా ముందుకు సాగుతున్నారా? అంటే అది కూడాలేదు.రామ‌సుబ్బారెడ్డి, బీటెక్ ర‌విల మ‌ధ్య తీవ్రమైన అగాథం ఏర్పడింది. ఎమ్మెల్సీ అయిన ర‌వి పార్టీ అభ్యర్థుల

గెలుపు కోసం ఏమాత్రం కృషి చేయ‌లేద‌ని రామస‌బ్బారెడ్డి వ‌ర్గం తాజాగా ఆరోపించింది. ఇక‌, వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చి మంత్రి అయిన ఆది నారాయ‌ణ‌రెడ్డి ఓట‌మి భారం నుంచి ఇంకా బ‌య‌ట‌కు

రాలేదు. పైగా నిన్న మొన్నటి వ‌ర‌కు క‌లిసే ఉన్నామ‌ని చెప్పినా.. రామ‌సుబ్బారెడ్డి వ‌ర్సెస్ ఆది మ‌ధ్య అంత‌ర్గత పెనుగులాట‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఆదినారాయ‌ణ‌రెడ్డి ఎంపీగా పోటీ చేయ‌డంతో

ఇప్పుడు ఆయ‌న త‌న‌కంటూ ఓ నియోజ‌క‌వ‌ర్గం లేకుండా పోయింద‌ని బాధ‌ప‌డుతున్నార‌ట‌. సీఎం రమేష్ గ్రూపులను ప్రోత్సహించడంతో జిల్లాలో టీడీపీ దెబ్బతినిందంటున్నారు. ఇక రైల్వేకోడూరు,

రాజంపేట‌, రాయ‌చోటి నియోక‌వ‌ర్గాల్లో టీడీపీలోనూ నాలుగైదు గ్రూపులు ఉన్నాయి. మైదుకూరులో పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్‌ను ఓ సామాజిక‌వ‌ర్గ నేత‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో

క‌డ‌ప‌లో టీడీపీ ఇప్పట్లో పుంజుకునే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Posts