వర్షాకాలం వచ్చి ఇప్పటికే ఒక నెల దా టింది. కానీ చుక్క నీళ్లు కూడా కృష్ణా నదిలోకి రాలేదు. అన్ని రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండాలంటే 730 టిఎంసిల నీరు కావాలి. భారీ రిజర్వాయర్లు
ఉన్నా, అన్నీ కనీస నీటిమట్టం కంటే తక్కువగానే ఉన్నాయి. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని జలాశయాలన్నీ వరుణుడి కోసం ఎదురుచూస్తున్నాయి.
ఇందులో కేవలం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకే 368 టిఎంసిలు కావాల్సి ఉంది. కృష్ణా నదిపై అన్నింటి కంటే పెద్దదైన నాగార్జునసాగర్‌లో 510 అడుగుల మేర కనీస నీటిమట్టం నిర్వహించాలి.
పూర్తిస్థాయిలో 590 అడుగుల మట్టానికి గాను ప్రస్తు తం కేవలం 507.5 అడుగుల వరకు నీరు ఉంది. హైదరాబాద్ తాగునీరు, మిషన్ భగీరథ అవసరాల కోసం కనీస నీటిమట్టానికి దిగువకు
వెళ్లి నీటిని తీసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఎక్కువ నీటినే తీసుకుంది. మొత్తం 312 టిఎంసిల సామర్థానికి గాను ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 127 టిఎంసిల నీరు ఉంది. ఇంకా
185 టిఎంసిల నీరు వస్తే సాగర్ గేట్లను ఎత్తుతారు.ఇక్కడి వరకు నీరు రావాలంటే దీని ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం సైతం నిండాల్సి ఉంటుంది. సాగర్ తర్వాత అధిక నీటి నిల్వ సామర్థం
ఉన్నది శ్రీశైలం జలాశయానికే. 885 అడుగుల పూర్తిస్థాయికి గాను ప్రస్తుతం 805.8 అడుగుల మేర నీటిమట్టం ఉంది. శ్రీశైలంలో 215.8 టిఎంసిల నీటి నిల్వ సామర్థం ఉండగా, ప్రస్తుతం
ఉన్నది కేవలం 32 టిఎంసిలు మాత్రమే. ఇంకా 184 టిఎంసిల నీరు శ్రీశైలంలోకి రావాల్సి ఉంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ కలిపి 360 టిఎంసిలకు పైగా నీరు రావాల్సి ఉంది. ఇక్కడి వరకు నీరు
రావాలన్నా, ఎగువన కర్ణాటకలో ఉన్న రిజర్వాయర్లన్నీ నిండడం, అక్కడ భారీ వర్షాలు కురవడంతో పాటు, తెలంగాణ, ఎపిలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురియాల్సి ఉంటుంది.
అప్పుడే బేసిన్‌లోని రిజర్వాయర్లకు అన్నింటికీ జలకళ ఉంటుంది. ఆల్మట్టిలో 129.7 టిఎంసిలకు గాను కేవలం 23 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. ఇంకా 107 టిఎంసిల జలం కావాలి.
ఇదేవిధంగా నారాయణపూర్‌లో 37.6 టిఎంసిలకు గాను 19 టిఎంసిల నీరు మాత్రమే ఉంది. దీనికి తోడు భీమా నదిపై నిర్మించిన ఉజ్జయిని రిజర్వాయర్‌లో 117.2 టిఎంసిలకు గాను 32
టిఎంసిలు మాత్రమే నీరు ఉండగా, ఇంకా 85 టిఎంసిల కోసం వరుణుడి వైపు జలాశయం చూస్తుంది.తుంగభద్ర రిజర్వాయర్‌లో సైతం 100 టిఎంసిలకు గాను కేవలం 1 టిఎంసి నీరు మాత్రమే
ఉంది. ఇంకా 99 టిఎంసిలు వస్తేగానీ జలాశయం నిండదు. జూరాలలో 9.66 టిఎంసిలకు గాను కేవలం 1.99 టిఎంసిల నీరు ఉండగా, ఇంకా 7.6 టిఎంసిల నీరు రావా ల్సి వస్తే జలాశయం
గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతారు. పులిచింతలలో సైతం 45.7 టిఎంసిలకు గాను ఒక్క టిఎంసి నీరు కూడా నిల్వ లేదు. మొత్తంగా కృష్ణా బేసిన్‌లో ఉన్న అన్ని ప్రధాన రిజర్వాయర్లలో కలిపి
730టిఎంసిల నీళ్లు రావాల్సి ఉంది. ఇందు లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోనే 368 టిఎంసిల నీరు కావాలికర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి రిజర్వాయర్లోకి నీటి ప్రవాహం వచ్చి
చేరుతోంది. 16876 క్యూసెక్కుల మేర ఆల్మట్టిలోకి నీరు వస్తుండగా, ఉజ్జయినిలో సైతం 8398 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుంది. స్థానిక వర్షాలతో శ్రీశైలంలోకి 93 క్యూసెక్కులు,
నాగార్జునసాగర్‌లోకి 704 క్యూసెక్కుల నీరు వస్తుంది.