YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుకు సీఎం యావపై సెటైర్లు

చంద్రబాబుకు సీఎం యావపై సెటైర్లు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడి జరిగి గట్టిగా రెండు నెలలు కూడా కాలేదు. కానీ వైసీపీపై అపుడే ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిపోతోందట. జనమంతా మళ్ళీ చంద్రబాబునాయుడు పాలన కావాలంటున్నారు. అనుభవం లేని జగన్ని వద్దనుకుంటున్నారుట. ఇదీ చంద్రబాబునాయుడు జ్యోతిష్యం. జగన్ ఇంకా కుర్చీ ఎక్కి కుదురుకోనేలేదు. ఆయన్ని దించేసి ఎక్క్దేద్దామనుకుంటున్న టీడీపీ అధినేత ఆరాటం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్ధం కాని పరిస్థితి. ఎన్నికలకు ఇంకా అయిదేళ్ళ వ్యవధి ఉంది, పోనీ కేంద్రంలో మోడీ జమిలి ఎన్నికలు తెచ్చినా కూడా కచ్చితంగా మూడున్నరేళ్ళ పైమాటే. మరి రెండు నెలలలోపే ఓర్వలేకపోతే మిగిలిన కాలమంతా ప్రతిపక్షంగా చంద్రబాబు ఎలా పనిచేయగలుగుతారో. మరీ అంతలా అధికార వియోగం అలవి కాదేమోనని అంతా అంటున్నారు.నేను అన్నీ చేశాను, అందరికీ చేశాను, అయినా ఎందుకు ఓడిపోయానో అర్ధం కావడంలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబునాయుడు నోట ఇదే మాట. తప్పులు లేకపోతే జనం ఎందుకు ఓడిస్తారు. ఈ మాత్రం అర్ధం కాకపోతే నలభయ్యేళ్ళ అనుభవం ఎందుకో మరి. ఎటువంటి అర్హత లేకుండా కుమార రత్నాన్ని రెండేళ్ళ పాటు మంత్రి పదవిలో కూర్చోబెట్టినది తప్పు కాదేమో. ఏపీలో ఇసుక దందాలు, అవినీతి అక్రమాలు జరుగుతున్నా కళ్ళు మూసుకుని కూర్చోవడం కూడా పొరపాటు కాదేమో. ప్రతిపక్షాన్ని కనీసం గుర్తించకుండా అసెంబ్లీ లోపలా, బయటా నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేయడమూ తప్పు కాదేమో. ఇక విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రతీ రోజూ నేనే సీనియర్ అంటూ గానా భజనాలు చేయించుకోవడం ఇవన్నీ కూడా బాబు గారికి సబబేమో. కానీ జనానికే రోత పుట్టి పక్కన పెట్టారు మరి.
ఇదిలా ఉండగా తనకు మాదిరిగానే జగన్ కూడా హామీలు నెరవేర్చకుండా వదిలేయాలని చంద్రబాబునాయుడు ఉన్నట్లుంది. సీపీఎస్ విధానం రద్దు కష్టమంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా చాలా కష్టమట. ఇక జగన్ ఇచ్చిన హమీలన్నీ అలవి కానివేనట. వాటిని నెరవేర్చడం ఆయన తరం కాదట. అపుడే జనంలో జగన్ మీద నమ్మకం పోయిందట. ఎపుడు ఎన్నికలు పెట్టినా టీడీపీ విజయం సాధించడం తధ్యమని చంద్రబాబు గారు ఆనంద డోలికల్లో వూరేగిపోతున్నారు. నిజమే కానీ జగన్ సినిమా ఇపుడే మొదలైంది. ఇంకా ఒక్క రీల్ కూడా దాటలేదు. అపుడే ఎగిగి గంతులేస్తే ఎలా బాబూ అంటున్నారు వైసీపీ నేతలు. రేపటి రోజున జగన్ చెప్పిన హామీలు నెరవేరిస్తే మరి చంద్రబాబు జీవితంలో గెలవనని గట్టిగా జనంలోకి వచ్చి చెప్పగలరా అంటూ సవాల్ చేస్తున్నారు. మరి బాబు గారి హుందా రాజకీయాలు అంటే ఇవేనేమోనని సెటైర్లు పడుతున్నాయి

Related Posts