యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తూర్పు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో సోమవారం వైయస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ పార్లమెంట్ వైసీపీ ఇంచార్జ్ పొట్లూరి వీరప్రసాద్ , ఈస్ట్ వైసీపీ ఇంచార్జ్ బొప్పన భవకుమార్ వైయస్ విగ్రహానికి పూల మాలలు వేసినివాళులర్పించారు. కేక్ కట్ చేసి విద్యార్దులకు పంచిపెట్టారు. అర్హులైన పేదలకు పెన్షన్లను అందచేసారు. పొట్లూరి వీర ప్రసాద్ మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదంతో పాలన సాగించిన ఏకైక సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి. రైతులు, పేదల కన్నీళ్లను తుడిచారు కాబట్టే.. వారి మదిలో చిరస్థాయిగా నిలిచారు. ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటారని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి చేస్తాం. కులం, మతం, ప్రాంతం చూడకుండా అర్హులైన వారందరికీ ప్రభుత్వ పధకాలను అందచేస్తాంమని అన్నారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ రైతు బాంధవుడు వైయస్ జయంతి రోజు రైతు దినోత్సవం జరపడం ఆనందంగా ఉంది. రైతుల కష్టాలను గుర్తించి ముందు చూపుతో ఆనాడే వైయస్ పులిచింతల పూర్తి చేశారు. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చారు, ప్రజలు కష్టాలు తీరుతాయని అన్నారు.