YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బడ్జెట్‌ ప్రకటనకు భిన్నంగా ఆర్థిక బిల్లు! పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకం పెంపు?

బడ్జెట్‌ ప్రకటనకు భిన్నంగా ఆర్థిక బిల్లు!       పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకం పెంపు?

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

మోడీ.. పాలనలో దేశం ఇలా అయ్యిందని గొప్పలు చెప్పుకునే వారికి తన తాజా బడ్జెట్ లో వరం ఇవ్వటం తర్వాత.. నిత్యవసర వస్తువైన పెట్రోల్.. డీజిల్ మీద లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ వాత పెట్టిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు తాముకానీ పవర్లోకి వస్తే.. లీటరు పెట్రోల్.. డీజిల్ రూ.50 కంటే తక్కువకే కట్టడి చేస్తామని.. భారీగా వేస్తున్న పన్నుల భారం నుంచి తప్పిస్తామంటూ సోషల్ మీడియాలో చెప్పిన మాటలు అన్ని ఇన్ని కావు.అయితే.. అలాంటివేమీ మోడీ-1లో చేయని కేంద్రం.. తన తాజా టర్మ్ లోనూ అలాంటివేమీ చేయకపోగా.. కొత్త వాత పెట్టేందుకు రెఢీ అవుతున్న తీరు ఆందోళనగా మారిందని చెప్పాలి. బడ్జెట్ లో లీటరుకు రూ.2చొప్పున పెంచుతున్నట్లు చెప్పగా.. ఆర్థిక బిల్లులో మాత్రం అందుకు భిన్నంగా లీటరుకు రూ.5 చొప్పున పెంచేస్తూ బిల్లును రూపొందించినట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రో బాదుడు మరింత భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం బడ్జెట్‌లో చెప్పింది ఒకటి.. ఆర్థిక బిల్లులో పొందుపర్చింది మరొకటి! పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకాలు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ, మరో రూ.5 పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లును రూపొందించింది. దీన్ని బట్టి చూస్తే మున్ముందు మళ్లీ పెట్రో బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ.2 మాత్రమే పెంచాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించినా, అదను చూసి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు ప్రత్యేక అదనపు పన్ను (ఎస్‌ఏడీ) రూపాయి, రహదారులు, మౌలిక వసతుల సుంకం మరో రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు.దీన్ని బట్టి లీటరు పెట్రోల్‌కు ఎస్‌ఏడీ రూ.8కి, డీజిల్‌పై రూ.2కు పెరుగుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా సుంకం రూ.9కు పెరుగుతుంది. బడ్జెట్‌ ప్రకటనలను చట్టంగా మార్చే ఆర్థిక బిల్లు వద్దకు వచ్చేసరికి మాట మారిపోయింది. ఈ పన్ను, సుంకం ఇంకా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మార్గం తెరిచి ఉంచుకుంది. లీటరు పెట్రోల్‌పై ఎస్‌ఏడీ రూ.7 నుంచి రూ.10కి, డీజిల్‌పై రూపాయి నుంచి రూ.4కు పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లులోని 185వ క్లాజ్‌లో పొందుపర్చింది. అలాగే 201వ క్లాజ్‌లో రహదారులు, మౌలిక వసతుల సెస్సు రూ.8 నుంచి రూ.10కి పెంచేలా నిర్దేశించింది. ఈ రెండూ కలుపుకుంటే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు లీటరుకు మరో రూ.5 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రూ.2 పెంచినా, ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు మరింత పెంచుతుంది.

Related Posts