తెలంగాణ ఎన్నారైఫోరం ఆధ్వర్యంలో లండన్ లో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలకు బ్రిటన్ నలుమూలల నుండి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులుహాజరైయ్యారు.ఈ వేడుకలకు లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, భారత రాయబారి ఉన్నతాధికారు కెఇవోమ్ముఖ్య అతిధులు హ హాజరై ప్రసంగించారు . లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ప్రచారం లో తెలుగు వారు మొదటి స్థానం లో ఉన్నారని తేలిపారు . 8 ఏండ్లు గ లండన్ బోనాల్లో పాల్గొనడం గర్వం గ ఉందని తెలిపారు.లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ ఇంగ్లాండ్ గడ్డ పై తన నియోజకవర్గం లో బోనాలు నిర్వహణ చేయడం హిందూ సాంప్రదాయాల్లో భాగస్వామ్యం అవ్వడం సంతోషకరమని తెలిపారు.ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తం గ విదేశాల్లో మొట్ట మొదటి సారి బోనాలు ( 2011 లో)
నిర్వహణ , నా ప్రయత్నానికి సహకరించి ఈ రోజు విశ్వవ్యాప్తం గ బోనాలు నిర్వహణ కి దోహద పడ్డ అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఆచారాల్ని ,సాంప్రదాయాల్ని ప్రచారం చేసే బాధ్యత , సేవ బాధ్యత తో సంస్థ పని చేస్తుందని సంస్థ నియమాల మేరకు కలిసి వచ్చే అందరి తో పని చేస్తుందని తెలిపారు.ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి ప్రచారం తర్వాతి తరం వారికి మన సాంప్రదాయాలు మరిచిపోకుండా ఉంటాయని తెలిపారు.ఉపాధ్యక్షులు రంగు వెంకట్ మాట్లాడుతూ విదేశాల్లో పుట్టి పెరిగే భారత సంతతి కి మన పండుగలు జరపడం చాలా ముఖ్యమని లేకుంటే వారి మూలాలు మరిచిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.కార్యక్రమం స్థానిక లక్ష్మి నారాయణ గుడి లో కార్యదర్శి మహిళా సభ్యుల ఆధ్వర్యం లో దుర్గా మాతకు బోనం సమర్పించి, ఒడిబియ్యం ,లండన్ పుర విధుల్లో '' తొట్టె లు , బోనాలు '' శోభాయాత్ర చేశారు అనంతరం క్రాన్ఫోర్డ్ కాలేజ్ ఆడిటోరియం లో శ్రీమతి మీనాక్షి అంతరి అధ్యక్షత గా నరేంద్ర వర్మ , శ్రీ వాణి ల సంయుక్త వక్తలు గా సభ ప్రారంశమయి గా మహంకాళి మాత కి బోనాలు సమర్పించి పూజ నిర్వహించారు . అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ,భరత నాట్యం ,గీతాలాపన ,నృత్యాలు ,చిన్నారుల చేత నాట్య ప్రదర్శన , ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమం సాగింది . తెలంగాణ వంటకాలు ,శాఖాహార మాంసా హార భోజనం ఏర్పాటు చేశారు.సంస్కృతి ప్రచారం లో భాగస్వామ్యమయి బోనాలు నిర్వహించిన , వివిధ సాంస్కృతిక ప్రదర్శన లు చేసిన వారికి బహుమతి లు అందచేశారు .