YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ముంబై మెటల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

Highlights

 

  • కళాచౌకీ ప్రాంతంలో దట్టంగా పొగలు
  • భారీగా ఆస్తి నష్టం 
  • 16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసిన సిబ్బంది 
ముంబై మెటల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం 

ముంబైలోని కళాచౌకీ ప్రాంతంలో ఉన్న  ఈస్టల్ మెటల్ కంపెనీలో మంగళవారం  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ కంపెనికి చెందిన  గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కళాచౌకీ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది. ఈ కంపెనీకి సమీపంలో పలు భవన సముదాయాలు ఉండటంతో.. ముందు జాగ్రత్తగా అక్కడ నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కళాచౌకీ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
 

Related Posts