యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశంలో అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. కాటికి కాళ్లు చాపుకున్న ముసల్లోళ్లు కూడా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు సమాజాన్ని కలవరపరుస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఏడేళ్ల బాలికపై 65ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాంతంలో సీడీ బ్లాక్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో దంపతులు ఏడేళ్ల బాలికతో కలిసి ఉంటున్నారు. బాలిక తండ్రి అదే అపార్ట్‌మెంట్లో ఓ ఫ్యామిలీకి కేర్ టేకర్ పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం అతడు కూరగాయలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా బాలిక బయట ఆడుకుంటోంది. వారి ఇంటికి సమీపంలో షాపు స్టేషనరీ షాపు నిర్వహిస్తున్న 65ఏళ్ల వృద్ధుడి కన్ను బాలికపై పడింది. చాక్లెట్స్ ఇస్తానని బాలికను పిలిచిన వృద్ధుడు ఆమెను షాపు లోపలికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుమార్తె ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన బాలిక తల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకసాగింది. ఆమె తన షాపు దగ్గరికి రావడాన్ని గమనించి వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆందోళనపడిన ఆమె షాపులోకి వెళ్లి చూడగా బాలిక జననాంగాల వద్ద రక్తస్రావంతో పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పాపపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు చెప్పారు. షాకైన బాధితురాలి తల్లి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు