YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ మైండ్ గేమ్ లో జగన్

బీజేపీ మైండ్ గేమ్ లో జగన్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని ఉద్దేశ పూర్వకంగానే వేధిస్తోందన్నారు. పోలీస్ శాఖను తన గుప్పిట్లో పెట్టుకుని ఇష్టమొచ్చినట్టు చేయడం సరికాదని హితవు పలికారు. ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప, తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదన్నారు. గుంటూరులో సోమవారం  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై విమర్శలు కురిపించారు. వైఎస్ జగన్ మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారనీ.. కానీ, ఆయన పూర్తిగా నిరాశ పర్చారని కోడెల ఎద్దేవా చేశారు. ‘అమరావతి నిర్మాణం ఆగిపోయింది. రాష్ట్రంలో విత్తనాల కొరత వచ్చేసింది. విద్యుత్తుకు సంబంధించి ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు వచ్చాయి. టీడీపీ హయాంలో ఎప్పుడూ క్షణం కూడా కరెంట్ పోలేదు’ అని అన్నారు. 22 మంది ఎంపీలను గెలిపించినా ప్రత్యేక హోదా సాధించడంలో వైఎస్సార్‌సీపీ విఫలమైందని కోడెల విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధులేవీ ఇవ్వకపోయినా ఆ పార్టీ మాట్లడటంలేదని ధ్వజమెత్తారు. కేవలం చంద్రబాబు మీద కక్ష కొద్ది ప్రభుత్వం నడుపుతున్నట్లుగా వ్యవహారం ఉందని.. ప్రజా పాలన అందిస్తున్నట్టుగా లేదని విమర్శించారు. కేవలం చంద్రబాబు మీద కోపంతోనే ప్రజా వేదికను కూల్చేశారని కోడెల ఆరోపించారు. అసెంబ్లీని కూడా కేవలం చంద్రబాబును తిట్టడానికే సమావేశ పరుస్తున్నట్టుగా ఉందని ఎద్దేశా చేశారు. బీజేపీలోకి టీడీపీ నేతల చేరికలంటూ వస్తున్న వార్తలు.. ఆ పార్టీ ఆడుతున్న మైండ్‌గేమ్ మాత్రమేనని కోడెల అన్నారు. చంద్రబాబును జైల్లోకి పంపిస్తామని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. తన ఊపిరి ఉన్నంత వరకూ టీడీపీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

Related Posts