Highlights
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై
- చర్చకు కాంగ్రెస్ సభ్యుల పట్టు
- టీడీపీసభ్యుల ఆందోళన, ప్లకార్డుల ప్రదర్శన
- ప్లకార్డులు ప్రదర్శించవద్దన్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్
మంగళవారం మధ్యాన్నం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన పెద్దలసభలో మళ్లీ రగడ నెలకొంది. దీనితో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల దేశంలో కలకలం రేపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టు పట్టారు. మరోవైపు ఏపీకి నిధులు, ప్రత్యేక హోదాపై తెలుగు దేశం సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్లకార్డులు ప్రదర్శించవద్దని అన్నారు. గందరగోళం ఎంతకీ తగ్గకపోవడంతో సభ వాయిదా పడింది.