YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో స్మార్ట్ పోల్స్

అమరావతిలో స్మార్ట్ పోల్స్

 యువ్  న్యూస్ జనరల్ బ్యూరో:

మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన రాజధాని మారకపోతే ఎలా? అందుకే సాధారణ కరెంటు స్తంభాల స్థానంలో స్మార్ట్‌ పోల్స్‌ వచ్చేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో, మరో విశిష్ట సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. విపత్తులు తట్టుకుని, సాంకేతికత తోడుగా నిలావాలని ప్రజలంతా బలంగా కోరుకుంటున్న తరుణంలో అలాంటి ఒక సర్వీస్ ఇప్పుడు రాజధానిలో కులువుదీరుతుంది.. ఇప్పటికే ఇది వైజాగ్ లో సక్సెస్ అవ్వటంతో, మరిన్ని సౌకర్యాలు జోడించి అమరావతిలో పెట్టనున్నారు. స్మార్ట్ పోల్ గా పిలిచే ఈ స్తంబంలో వివిధ రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి...అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయనున్న పోల్స్‌లో స్మార్ట్‌ ఎల్‌ఈడీ వీధి దీపాలు, వైఫై హాట్‌ స్పాట్‌లు, పర్యావరణ సెన్సర్లు, నిఘా కెమేరాలు, డిజిటల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ బోర్డులు, ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ పాయింట్లు, వాయిస్‌ ఓవర్‌తో కూడిన ఇంట్రాక్టివ్‌ స్క్రీన్లు, పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, ఎమర్జెన్సీ కాల్‌బాక్స్‌లు వంటి సదుపాయాలుంటాయి. వీటికి ఉండే లైట్లు, వాతావరణ పరిస్థితులను బట్టి లైటింగ్ ఇస్తాయి. అంటే రాత్రివేళ ఎక్కువ లైటింగ్ ఉంటే.. తెల్లవారుజాము నుంచి లైటింగ్ తగ్గించేస్తాయి. ఈ పోల్స్ అన్నీ, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం అయ్యి ఉంటాయి.రాజధాని జనాభా, అవసరాలు పెరిగే కొద్దీ స్మార్ట్‌పోల్స్‌లో అదనపు సదుపాయాలు జమచేస్తుంటారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని నగరాల్లో పరిమిత సంఖ్యలో స్మార్ట్‌ పోల్స్‌ ఉన్నాయి. కానీ నగరం మొత్తంలో స్మార్ట్‌ పోల్స్‌ అమరావతిలోనే ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కంట్రోల్‌ సెంటర్‌కి సమాచారం పంపించేందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థలు స్మార్ట్‌పోల్స్‌లో ఉంటాయి. దానిలో ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా ఆపదలో ఉన్న విషయాన్ని కంట్రోల్‌ సెంటర్‌కి తెలియజేసే వీలుంటుంది. అలాగే నగరానికి కొత్తగా వచ్చినవారికి సమాచార కేంద్రంగా, మార్గదర్శిగా పయోగపడుతుంది.

Related Posts