YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

చతికిల పడిన ఖరీఫ్

చతికిల పడిన ఖరీఫ్

ఖరీఫ్ సాగు కింద గత ఏడాది కన్నా 27 శాతం తక్కువగానే సాగు విస్తీర్ణంలో నాట్లు వేయడమైందని, గత ఏడాది 319.68 లక్షల హెక్టార్లలో నాటు పడ గా, 201920 సంవత్సరానికి సంబంధించి గత వారం వరకు కేవలం 234.33 లక్షల హెక్టార్ల లోనే నాట్లు వేయడమైందని, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత నెలలో రుతుపవనాల వర్షాలు లోపించడమే దీనికి కారణం. ఏదేమైనా జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా కురుస్తాయని, నాట్లు ముమ్మరంగా పుంజుకుంటాయని వాతావరణ శాఖ ఆశాబావం వెలిబుచ్చింది. ఇదిలా ఉండగా 14 ఖరీఫ్ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను బాగా పెంచింది. ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభం కాగానే ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమైనప్పటికీ వర్షపాతానికి 33 శాతం లోటు ఏర్పడింది.ఖరీఫ్ ప్రధాన వరిపంటకు కేవలం 52.47 లక్షల హెక్టార్ల లోనే వరినాట్లు పడగా గత ఏడాది 68.60 లక్షల హెక్టార్లలో వరినాట్లు పడ్డాయి. చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక, అరుణాచల్‌ప్రదేశ్, బీహార్, అసోం, పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి. పప్పుధాన్యాల్లో ముఖ్యంగా కంది, మినుము, పెసర, చాలా తక్కువ విస్తీర్ణంలో అంటే కేవలం 7.94 లక్షల హెక్టార్లలోనే నాట్లు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ పంటలకు 27.91 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు. కాయధాన్యాలకు సంబ ంధించి గత ఏడాది 50.65 లక్షల హెక్టార్లలో నాట్లు పడ గా ఈ ఏడాది 37.37 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు.పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఈ ఏడాది చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర లతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పప్పుధాన్యాల సాగు చాలా తగ్గింది. చమురు గింజల సాగుకు సంబంధించి గత ఏడాది 59.37 లక్షల హెక్టార్లలో సాగు చేయగా ఈ ఏడాది గతవారం వరకు వేరుశెనగ, సొయాబీన్, సన్‌ఫ్లవర్ తదితర చమురు గింజల నాట్లు 34.02 లక్షల హెక్టార్లకే పరిమితం అయ్యాయి.వాణిజ్యపంటల్లో చెరకు సాగు గత ఏడాది 51.41 లక్షల హెక్టార్లలో నాట్లు పడగా, ఈ ఏడాది 50 లక్షల హెక్టార్ల లోనే నాట్లు పడ్డాయి. పత్తి, జనుము పంటలు కూడా దిగజారాయి. గత ఏడాది 54.60 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేపట్టగా, ఈ ఏడాది ఇంతవరకు 45.85 హెక్టార్ల లోనే సాగు చేపట్టారు. జనుము కూడా గత ఏడాది కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు చేపట్టడమైందికేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గత వారం సాధారణ వర్షపాతమే అని ఐఎండి చెప్పినప్పటికీ దానితో సంబంధం లేదని చెప్పారు. జులై 10 నాటికి తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం కాగా, ఈశాన్య మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలులో సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం కురిసింది. మిగతా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం కురిసింది.

Related Posts