యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీవారి దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది. కోయిల్ఆళ్వారు తిరుమంజనం, చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమంజనం కారణంగా 16న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్వదర్శనం నిలిపివేయనున్నారు.
ఆ తర్వాత దర్శనం ప్రారంభించి.. చంద్రగ్రహణం కారణంగా మళ్లీ సాయంత్రం 5 గంటల తర్వాత ఆపేస్తారు.
అంటే మొత్తంగా దర్శన సమయం కేవలం 5 గంటల పాటు మాత్రమే మిగులుతుంది. చంద్రగ్రహణం వల్ల రాత్రి 7 గంటల తర్వాత ఆలయ తలుపులు మూసివేసి 17న ఉదయం 5 గంటలకు తెరుస్తారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి.. ఆణివార ఆస్థానం పూర్తయ్యాక ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి దర్శనం ప్రారంభించనున్నట్లు తితిదే వివరించింది..